పుట:Navanadhacharitra.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

201

వినుతచరిత్రంబు ◆ విని శిష్యు లలరఁ
జెప్పి మత్స్యేంద్రుండు ◆ చిరలీలఁ బరఁగు
నప్పట్టణంబుస ◆ నారాత్రి నిలిచి
యటబాసి యుత్తరం ◆ బరిగిన త్రోవఁ
బటుబుదిఁ [1]జనిపాప ◆ బహులతాపటల
దాత్రంబు నఖిల [2]భూ ◆ ధవ ఘనస్తోత్ర
పాత్రంబు నర్జున ◆ పతి చండ కంక
పత్రనిదన్‌ళి తారి ◆ పత్రంబు జూడఁ
జిత్రంబునగు కురు ◆ క్షేత్రంబు గాంచి
[3]యనువున మత్స్యేంద్రుఁ ◆ డచ్చటి మహిమఁ
దన శిష్యులకుఁ బ్రమో ◆ దమునఁ జెప్పుచును
నారాత్రి యందుండి ◆ యమ్మఱునాఁడు
భోరున పయనమై ◆ పోవుచు నెదుర
నలినాస్య కంబుకం ◆ ధరి యుత్పలాక్షి
నలినీలకుంతలి ◆ నావర్తనాభిఁ
గమనీయ చక్రవా ◆ క స్తనింజారు
కుముద గంధిని బిస ◆ కోమలహస్త
నతులశైవాల రో ◆ మావళీ కలిత
నతిసమున్నత సైక ◆ తాంచితజఘనఁ
[4]గలహంసగతిమంద ◆ గతిజలజాస్య
లలిత[5]శీకర హార ◆ లతికా సమేత
నిలజాహ్నవీకన్య ◆ నింపారఁ గాంచి
యెలమి శిష్యులకు మ ◆ త్స్యేంద్రుఁ డిట్లనియెఁ
జలిగొండకూఁతురు ◆ సవతి యీ గంగ
మలహరు జడలలో ◆ మలయు నీగంగ
కపిలుని కోపొగ్నిఁ ◆ గనలిన సగర
నృపతనూజులనెల్ల ◆ నిర్జరపురికి
ననుకంప చిగురొత్త ◆ ననిసిన గంగ
యొనర రానేరక ◆ యున్న వారైనఁ
దను గంగ గంగని ◆ తగఁ బేరుకొనిన
మును ఘోరమగు తపం ◆ బుల దానములను

  1. జనుచుండ.
  2. నఖిలలశే ధ్వజఘనస్త్రోత్ర.
  3. యనమున్ను.
  4. గతహంసగమన నుద్గతభాస్యరహిత
  5. శేఖర.