పుట:Navanadhacharitra.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

168

నవనాథచరిత్ర

వింతగా మానవ ◆ వేషియై నిలువఁ
గని మీననాథుఁ ◆ డెక్కడఁ బొడగాన
మెనయ నేమిటి కిందు ◆ నిట్టి విచిత్ర
మని వెఱఁగందుచు ◆ నతని కిట్లనియె
మును భుజంగాకార ◆ మున నేఁచి యిపుడు
మనుజుఁడ వయిన యా ◆ మార్గ [1]మెఱుంగ
వినుపింపు మనుటయు ◆ వినతుఁడై వాఁడు
తనపూర్వచరిత మం ◆ తయుఁ దెల్లముగను
వినుమని ముదమార ◆ వినుతించి పలికె

నాగార్జున సిద్ధుని కథ.



నిలలోనఁ దొల్లి న ◆ రేంద్రజిత్తనఁగఁ
గలఁడిందువంశ శే ◆ ఖరుఁడగు నృపతి
యారాజు సతి మాళ ◆ వావనీవిభుని
కూరిమికూఁతురు ◆ కొడుక నేనైతి
వారలు నేను ధ్రు ◆ వంబైన వేళఁ
జేరిన నాఁ డొక్క ◆ సిద్ధముఖ్యుండు
యెఱుకమైఁ దల పోయ ◆ నీ కుమారుండు
నెఱయోగి యగుఁగాని ◆ నృపుఁడుగాఁ డనుచు
నరిగిన పిమ్మట ◆ నై దేండ్లు చనఁగ
సరగున మాతండ్రి ◆ చదువు చెప్పించి
పరువడి నటమీఁద ◆ పండ్రెండొ [2]యేఁట
నురువైభవంబున ◆ నుపవీతుఁ జేసి
యరుదుగా నిరువాగె ◆ హయములఁ బరపఁ
గరులనేర్పునఁ జిత్ర ◆ గతు(ల) నమర్ప
నిటలంబుగా వింట ◆ నిరుగడ నేయ
నెటువంటి జెట్లతో ◆ నెదిరి పెనంగ
బరిజింప నేర్పించి ◆ పరిణయంబునకు
నిరవొంద సమకట్టు ◆ నెడ నొక్కనాఁడు
వేఁటాడ మనమున ◆ వేడుక వొడమి
గాటమైనను వేఁట ◆ కాండ్రును గొలువ
నీకాననము చొర ◆ నిచ్చట నొక్క

  1. వగుటయామార్గమా తెఱగు.
  2. ఇది కవిప్రయుక్తమనియే తోచెడిని.