పుట:Navanadhacharitra.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

154

నవనాథచరిత్ర

[1]గృష్ణాజినము నాల ◆ కృత్తియు నార్ద్ర
కృష్ణాజినంబనఁ ◆ గీర్తింపఁ బడిన
ధరీయింపరాని దు ◆ ర్దానముల్ గొందు
ఖరకరహిమకర ◆ గ్రహణకాలములఁ
గడికి నొక్కొక్కని ◆ ష్కముచేత నిడఁగఁ
గుడుతును బులగము ◆ కుత్తుకమోప
విడువక యిట్టు లీ ◆ విధమున ధనము
గడియింతు నే నటు ◆ గానఁ బూఁబోణి
యొఱపైన నీచన్ను ◆ లురముపైఁ గదియఁ
బఱతెంచి కౌఁగిట ◆ బంధింపకున్న
నీకు బ్రాహ్మల యాన ◆ నెయ్యియుఁ బప్పుఁ
బాకంబు రొట్టెలుఁ ◆ బంచదారయును
గండమండెఁగలును ◆ గారెలు నేత
వండినట్లును నాన ◆ వాలపాయసము
లడ్డువంబులును బె ◆ ల్లంబుబూ రెలును
ఇడ్డెనల్ కుడుములు ◆ నిదె తెచ్చి నాఁడఁ
గోమలి పొత్తులఁ ◆ గుడుతము రమ్ము
మామనంబున వేడ్క ◆ మల్లడి గొనెడిఁ
బప్పు దెచ్చితి నన్న ◆ పాఱితే నపుడు
తప్పెఁబో నీజాణ ◆ తనమునే మెచ్చ
దవ్వులనైన [2]శ్రా ◆ ద్ధంబని విన్న
నవ్వడి మున్నునే ◆ న చటికిఁ బోయి
పప్పు మండెఁగలును ◆ బాయసాన్నంబు
లప్పాలుఁ గొసరి తృ ◆ ప్తాస్థగాఁ దిందు
నూర్పువుచ్చక తలఁ ◆ యూఁచక వార
కార్పక నే నొక్క ◆ కడవెడు దాఁకఁ
ద్రావుదు నాజ్య మం ◆ దఱు వెఱగందఁ
గావునఁ బెండ్లిండ్లఁ ◆ గలుగు భోజనము
[3] గాతికి నేరాక ◆ కలకాల మెల్ల
దాతల యిండ్ల శ్రా ◆ ద్ధంబు గోరుదును
నాతి నానుగుణగ ◆ ణం బెల్ల వినుము
జాతిగాఁ గొక్కోక ◆ శాస్త్రమంతయును

  1. కృష్ణాజినము కృతియును నార్ధకృష్ణా
  2. శార్ధంబని
  3. ఘాతకు