పుట:Narayana Rao Novel.djvu/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గృహమేధి

71

గొల్లవారిలో నచ్చమ్మ నమ్మకమగు బంటు. దాని తల్లిదండ్రులు సుబ్బారాయుడి గారి యింటనే యుండువారు. అచ్చమ్మ తండ్రి గతించినాడు. తల్లి వృద్ధురాలై యింటిపనులను జేయుచుండును. అచ్చమ్మ వివాహము చేసికొని భర్త నిల్లరికము తెచ్చుకున్నది. అచ్చమ్మ యిద్దరు చెల్లెండ్రు నటులనే భర్తల నిల్లరికము తెచ్చుకొని సుబ్బారాయుడు గారింటనే కాపురముండి నారు.

వారి భర్తలు సుబ్బారాయుడు గారి పాలేళ్ళు. వారి పిల్లలు గొడ్ల కాపరులు, వారు పనికత్తెలు.

సుబ్బారాయుడి గారి దొడ్డిలో గాపురమున్న రెండవ కాపుకుటుంబము సోమన్న యల్లునిది. సోమన్నకు ముగ్గురు కొమరితలు నలుగురు కుమారులు. సోమన్న కొమరితలు కుమారులుగూడ నాల్గవతరగతివరకు జదువుకొన్నవారే. సోమన్న తన పెద్దయల్లుని సుబ్బారాయుడు గారి దగ్గర పాలేరుగా ప్రవేశపెట్టి తన యింటి ప్రక్కయింటిలో గాపురముంచినాడు. తక్కిన యిరువురు కొమరితలను దొడ్డిపట్లలో నొకరికి, గోపాలపురములో నొకరికినిచ్చి పెండ్లి చేసినాడు. వారందరు కడుపులు ఫలించి సుఖముగా కాపురములు చేయుచున్నారు. సోమన్న కు ముగ్గురు కొమార్తెలు వరుసగా బుట్టుటచే, నిక కొడుకు పుట్టడని నిరాశ చెంది, బీదకుటుంబపు బాలునికి పెద్ద కూతురునిచ్చి యిల్లరికము తెచ్చుకున్నాడు. ఇప్పుడు సోమన్న పెద్ద కుమారుడు సత్తెయ్య ఇరువదిరెండేండ్ల వాడు. చిన్నతనమున నారాయణరావుతో నాడుకొన్నాడు. నారాయణరావు రాజకుమారుడు, సత్తెయ్య బంట్రోతు. నారాయణ రావు కలెక్టరు, సత్తెయ్య డఫేదారు.

సుబ్బారాయుడి గారి దొడ్డిలో కాపురమున్న వెలమలు పదియేండ్ల క్రితము సుబ్బారాయుడు గారి పనిలో చేరి వొళ్ళువంచి పని చేయుచుండుట చేతను, వారు కడియములో మంచి పేరుగన్న పూదోటలో పని చేసియుండుట చేతను, సుబ్బారాయుడు గారు వారిని పూలతోటపనికి నియోగించిరి. ఆలమండ గ్రామంలో మామిడితోటలో బని చేసిన కుటుంబమును కొత్తపేట కనతిదూరమున నున్న తన ముప్పది యకరములతోటలో గాపురముంచినారు.

సుబ్బారాయుడి గారిదొడ్డిలో కాపురమున్న అయిదు గొల్ల కుటుంబములలో ఒక గొల్ల దూడల బెంచుటలో బేరుగన్న వాడు. ఆతని చేయి తగిలిన పశువుల దరికి రోగములు సేరవు. ఈతలుడిగిన పశువులు, అఱ్ఱుగడిగిన యెద్దులు వారి దొడ్డిలో పింఛనుద్యోగులవలె, వార్థకమున సుఖించుచుండును.

సుబ్బారాయుడి గారికి బశువులన్న బరమ ప్రాణము. మానవులకన్న వాని నెక్కుడు ప్రేమతో జూడవలెనని యాయన మతము. దొడ్డిలోని దూడల నన్నిటిని బేరులు పెట్టి ముద్దుగా బిలుచుచు గోముగా బెంచుచుందురు. ఏ దూడకైన నించుక కాలు నొచ్చినచో నాయన ప్రాణము విలవిల లాడిపోవును.

సుబ్బారాయుడు గారికి ఎనిమిదికాండ్ల స్వంత వ్యవసాయమున్నది. అయిదు ఒంగోలు జతలు, రెండు మైసూరుజతలు, సింధీజత యొకటియు, కేవలము సవారి