పుట:Narayana Rao Novel.djvu/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముచ్చట్లు

57

సభల్లో యుద్ధాలు చేసి, శాసనసభలు ముక్కలు చేస్తారా? దేశంలో పోనీ, అసంతుష్టయినా కలుగ జేశారా? ఒక్కగాటిని నడవవలసిన దేశం భిన్న భిన్నమై ఎవరికి వారే యమునాతీరే అయిందీ! ఏమిటోయి స్వరాజ్యపార్టీ వారు చేసిన అద్భుతకృత్యాలు?

పర: ఒరేయి! నీకు అసలు నిరాకరణ వాదం అంటే ప్రాణంగదా, పోనీ, మీబోటిగా ళ్ళేమి చేశారు? ఖైదుకు వెళ్ళివచ్చి ఏ మొహం పెట్టుకొని మళ్ళా కళాశాలల్లో చేరారు?

నారా: నేను చేసినపని సరియైందని వాదించానటరా? ఆరు నూరైనా, నూరు ఆరైనా, ఒకటే మార్గాన్ని నమ్ముకువుండలేక పోయిన హృదయదౌర్బల్యానికి తలవంచుకుంటున్నాను. అంతే.

పర: కాని తీవ్రవాదనంటే నీ కెంత ఇష్టమైనా స్వరాజ్య పార్టీ వారు చేసిన కార్యాలు కొంచెమయినా గమనించకపోతే ధర్మదూరం కాదురా!

నారా: వాళ్ళు అసలు చేయలేదని అన్ను. బార్డోలీ తీర్మానం తప్పనీ, గాంధీ గారికి మెదడు లేదనిన్నీ, రీడింగు ప్రభువు రాజీకి వచ్చినప్పుడు ‘ఫత్వా ఖైదీలు’ అంటూ తాము బట్టిన కుందేటికి మూడేకాళ్ళని కూచున్నాడనిన్నీ మనమహానుభావులు చేసిన హేళణ – ఏ కొద్దో కాంగ్రెసు దేశానికి అర్పించిన పనిని మంటగల్పడమే కాకుండా, దేశానికి విషమైందని నా వాదన.

ఈ సంభాషణ స్నేహితులందఱు వినుచున్నారు. కొందరు విసుగుతో దూరముగాబోయి పేకాట మొదలుపెట్టిరి. కొందరు తామును సంభాషణలో బాల్గొనిరి.

స్నేహితులందఱకు ఆ అయిదురోజులు త్రుటిలో వెళ్ళిపోయినవి. పరమేశ్వరమూర్తి గృహప్రవేశమునకై కొత్త పేట వెళ్ళినాడు. తక్కుంగల మిత్రులు, రాజమహేంద్రవరమునుండియే పనివినినారు.

జానకమ్మ గారు కోడలిని జూచి మురిసిపోయినది. ఆమె పెద్దవియ్యపురా లామెను జూచి ‘ఏవమ్మా వదినా! సుఖపడాలని పెద్దకోడల్ని తెచ్చుకున్నావే, ఈవాళే పెద్దమనిషి అయ్యేలాగుంది’ అని నది.

‘ఇదివరకు కోడలు వచ్చి సుఖపెట్టింది, ఇప్పుడు ఈవిడ వచ్చి సుఖ పెట్తుంది! వాళ్ళ భార్యాభర్తలు కులాసాగా ఉంటే అదే పది వేలు’ అనినది జానకమ్మ గారు.

ఒక ఆవిడ: మీ కోడలు చాలా నాజూకుమంతురాలు. జమీందారు గారి అమ్మాయి పనేమి చేస్తుంది? మీకు కోడళ్ళు పని చెయ్యాలిటమ్మా అక్కా!

ఇంకోవనిత: ఏమమ్మా అత్తా! పెళ్ళి వారు అతి నాజూకు వారు. ఒక్కరూ వచ్చి కూచోరు. పలకరించరు. ఇంత గర్వాలేమిటమ్మా? మన వాళ్ళని చూచి ఒకటే మూతులు ముడుచుకోవడము.