పుట:Narayana Rao Novel.djvu/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

56

నా రా య ణ రా వు


లక్ష్మీ: జమిందారుగారి శ్రద్ధ చాలా విపరీతంగా వుందోయి.

ఆలం: అరే లక్ష్మీపతీ! మనకి రైల్లోకనబడ్డప్పుడు ఇంత మంచివాడు అనుకోలేదు.

రాజే: ఒరేయి నారాయణా! జమిందారు గారు నిన్ను పూర్తిగా ప్రేమించడం ప్రారంభించారు. ఆయనకళ్ళు నిన్ను తనివితీరా క్రోలుతున్నట్లు నీమీదే వుంటాయి.

ఓ స్నేహితుడు: అసలు ప్రథమదృష్టి ప్రేమవ్యాపారంలా కనబడుతూ వున్నదిరా !

వేరొక మిత్రుడు: జమిందారు శాసనసభలో ఎప్పుడూ స్వరాజ్య పార్టీ తరఫున పని చేస్తాడు. కాని ఆయనకు అసహాయోద్యమం ఇష్టం లేదంటారు.

లక్ష్మీ: ఇష్టం లేకేమి ఆయన జైలుకు వెళ్ళకపోయినా, 1922 సంవత్సరంలో అందరూ జైలుకు వెళ్ళినపుడు శాసనసభలో అస్తమానం గవర్నమెంటును ఖైదీల విషయం ప్రశ్నలు వేస్తూనే వుండేవారు. ఒరే రాజేశ్వరుడు! మీ జస్టిసుపార్టీ పక్కలో బల్లెమై పానగల్లును డేకించేసేవాడు.

నారా: బావా! పానగల్లును డేకించగల మగవాడు ఇంతవరకూ పుట్టలేదు. ఇక పుట్టబోడు. అతనికి అతనే సాటి. ఆంధ్ర విశ్వవిద్యాలయం విషయంలో ఆంధ్ర రాజధాని విషయంలో అతనికి ఉన్న పట్టుదల, దీక్ష ఇంకోడికి లేదు. ఆంధ్రాభిమానం ఇంతా, అంతా అని కాదు. పైగా తనకు పార్టీ మాటేలేదు. పైకి ఏమన్నా, క్రియలో అందరియందూ బ్రాహ్మణుడయ్యేది, బ్రాహ్మణేతరుడయ్యేది సమానప్రేమ ఆయనకు.

రాజే: నారాయణ రావుకూ జై! మా పార్టీ మర్యాదంతా కాపాడావురా.

నారా: అవునురా, స్వరాజ్య పార్టీ వాళ్లు శాసనసభలకు వెళ్ళి చేసినపని యేమిటి రా?

పర: ఒరే అల్లాంటే నేను ఒప్పుకోను. గవర్నమెంటు వారి మానస పుత్రుల మనుకొని, దేశద్రోహులై దేశం కోసం మనవాళ్ళు ఖైదులకు వెళ్ళి పడరాని పాట్లు పడుతోంటే చీమైనా కుట్టకుండా, లొల్లాయికబుర్లు చెప్పుతూ, ఉద్యోగాల కోసం ఏడ్చి నిద్రపోతూ, కాంగ్రెసును చండాలపు తిట్లు తిట్టిన మహానుభావులు కాదూ ఈ జస్టిసుపార్టీ సమరథులు?

నారా: నువ్వు చెప్పింది నిజం కాదనను. కాని, ఆ దృష్టి స్వరాజ్య పార్టీ వైపు మరల్చరా. తాము శాసనసభల్లోకి వెళ్ళి వెలగబెట్టేది ఏమి లేదని తెలుసును. వట్టి ప్రశ్నలు అడగడం తప్ప వీరు చేసిన మహత్కార్యం లేదు. వీరు సలిపిన గడబిడ అంతా వృధాయని తెలుసును. కాంగ్రెసులో వుండి ఖైదుకు వెళ్లలేరు, కష్టపడలేరు. శాసనసభలలో సభ్యులమని విఱ్ఱవీగడంతప్ప ఏమున్నది? సరియైనమార్గం చెప్పి దీక్షతో నడచుకోండర్రా అన్న ఆ మహాత్ముణ్ణి మూలకు తోశారు. ఆయన యేర్పరచిన బాటను నడిచే శక్తి లేక ఆక్షేపిస్తారూ? శాసన