పుట:Narayana Rao Novel.djvu/374

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


‘మీ ఆయనగోరు చిన్నతనంలో కుట్టమూర్తిలా ఉండేవోరు. తొనలు తొనలండీవొళ్లు. వంటినిండా నగలతో గంతులేస్తూంటే దిష్టి తగిలిపోతుందనకునేవోరు అమ్మగారు. అందరికీ ఎత్తుకోవాలని ఉండేది. ఎత్తుకోనిస్తేనా? ఆర్కి ఎంతబలం! ఓమాటు మా వంగోలావు గిత్తదూడను ఊరకుక్క ఒక్కటి కరవపోతుంటే దాన్ని తోకుచ్చుకొని బరబర లాగిపారేశారు. అప్పుడు మూడోయేడు. కుక్కపోతరించిన గే ద్దూడలాంటిది. అడిలి కొంయ్యో కొంయ్యో అంటూ పారిపోయిందండి.

‘ఆయన సదుగులు పెద్దవి, బుద్దులు గొప్పవి. ఎంత గొప్పవోరండీ!

‘చిన్నతనాన్నుంచి ఎలాంటివోళ్ళమీదా ప్రేమ. మాలోళ్ళంట ఆళ్లకన్నీ యిస్తూ ఉండేవోరు. గాంధిగారిమాట రాకమునుపే ఇంటిలోవన్నీ తీసుకెళ్ళి మాలోళ్ళపిల్లలకీ మా పిల్లలకీ పెట్తుండేవోరండి. ఎంత బకితి! మావోళ్ళంతా బజన చేస్తూఉంటే ఆ అందంవొలికే కన్నుల్తో చూస్తూ ఉండేవోరు. దయ ఇంతింత కాదుండి. మేం అప్పుడే అనుకునేవోళ్ళం. ఈయన పపంచంలో కల్లా తెలివైనవోరని.’

‘చదువులు అవీ ఎల్లాగుండేవి?’ శారద ఆ ప్రశ్న అప్రయత్నముగ వేసినది. తానేనా అడిగినది యని యాశ్చర్యముపడినది.

‘అమ్మయ్యో! ఆరి చదువేమిటి? అదుబుతం కాదమ్మా! నీ అదురుష్టం అమ్మా! మీ యిద్దరికీ యీడూజోడూ. తల్లీ మికీపాటికి చిన్నతనంలో నారాయణం గారివంటి బొజ్జనాన్నగోరు పుట్టాలండి. ముందుసంవత్సరం తప్పకుండా ఫుడ్తారులెండి.’

‘ఖైదుకు వెళ్ళారా?’

‘అవునండీ, ఇంతప్పటినుంచీ నెచ్చేరులే. అంతలో గాంధిగారొచ్చారు. ఒక్కటే నెచ్చేరులు నారాయణగోరు. తచ్చణం ఆయన్ని పట్టుకొని ఆరునెల్లు ఖైదులో యేశారు. ఎంతమందొచ్చారు బాబో ఆరు ఖైదుకు ఎళ్ళేటప్పుడు! ఈ సీమోళ్ళంతా వచ్చారండి.

‘ఖైదులో ఉన్నప్పుడు నిద్దరలేదు, తిండిలేదు మా జానకమ్మగోరికి. పెద్దయ్యగోరుమాత్రం ధైర్యంగా ఉన్నారుండి. జైలునుండి రాగానే మీ అత్తగోరు ఆరతి యిచ్చారుండి. పూజలు పురస్కారాలు జరిపారుండి.’

౧౯

బంధితుడు

వారంరోజులైన వెనుక మధురనుంచి రామచంద్రరావు తన్ను విప్లవకారులలో నొకనిగా నెంచి పోలీసువారు నిర్బంధించిరనియు, నారాయణుని తత్ క్షణము రమ్మనియు తంతివార్త నంపెను. నారాయణు డా వెంటనే బయలుదేరి మెయిలందుకొని చెన్నపురి వెళ్లినాడు. ఆ సాయంకాలము మెయిలులో మధురకు