పుట:Narayana Rao Novel.djvu/21

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
20
నా రా య ణ రా వు


ఏ ఋతువుల నే పూ లవతరించునో, ఏ ప్రదేశముల నే కుసుమములు కలకల లాడిపోవునో హాసప్రఫుల్ల వదనయై శారద చెప్పచుండును.

శారదాకుమారి సౌందర్యమూర్తి. ఆమె నయనములు విస్ఫారితములై, యర్ధనిమీలితములై, దీర్ఘ నీలవర్త్మాంచలములై, విచిత్ర జీవిత నాటకము నాలోకించుచు, నాశ్చర్యహాసముల వెదజల్లుచుండును. నల్లని పాపలు రెప్పలమాటున సగము దాగికొని యామినీ నీలాకాశగంభీరములై తోచును. మేలిమిబంగారు రంగులో తామరయెరుపు కలిపిన శరీరచ్ఛాయ. నవయౌవనపు తొలి వెలుగు లామె ఫాలముపై, నాసికాగ్రముపై, బుగ్గలపై, పెదవుల యంచులపై, చిబుకముపై, కంటి పైరెప్పలపై, చెవుల తమ్మెలపై నర్తించుచుండును. స్వప్నసీమలగు కనుబొమలు సన్ననై చంద్రవంక వంపులు తిరిగి చెక్కుల మాయమైనవి. బంగారు గన్నేరు మొగ్గవంటి ముక్కు, విలువంపగు సరుణోత్తరోష్టముపై పైడిమేడ గట్టినది. మధ్య సుడినొక్కుతో కాశీరత్న పుష్పముల జంటబోలి యామె యధరము స్పష్ట రేఖాంకితమై తేనియలు చెమరించుచున్నది. లేత దానిమ్మపూ వామె చిబుకము. పదునాలుగేండ్ల యెలప్రాయపు మిసిమిరేకలు కర్ణములనుండి యంగుళీయాంచలముల కెత్తిపోతలైనవి. బాహు మూలములనుండి పాదతలములకు సొంపు లెగబోయు ఏటి కెరటాలవంపులు మిలమిల లాడిపోవు కమ్మని చందనవర్ణపు పట్టుపరికిణీమడమలతో మెలివడి పోయినవి, నానాట నానందకిసలయములై మొలకెత్తు ముగ్ధభావములు గులాబి రైక మబ్బుల, నీలిపయ్యెద జిలుగువెలుగుల తొంగి చూడసాగినవి.

ప్రక్క పాపట తీసికొని, ఒత్తై పొడవైన కచభారమును పిరుందులవరకు వ్రేలాడు వాలుజడగా గీలించి, కాళ్ళకు జరీబుటాపూవుల మొఖమల్ లూఢియానా చెప్పులు తొడిగికొని, చెవుల లోలకులలో, కుడిముక్కు పుటమున బేసరిలో, మెడను హారములలో రవ్వలు, నీలాలు, కెంపులు తళుకులీనగా, నెమ్మదిగా పూవుల నరసికొనుచు, నొయ్యారముగా నడుగులిడుచు, తోటలో శారదాదేవి విహారము చేయుచుండగా, “నాన్నగారు వచ్చినా” రని కబురు వచ్చినది.

శారదాదేవి జమీందారు గారి తనయ నన్నమాట మఱవదు. ఆంధ్ర దేశమున తన సుగుణములచే, దాతృత్వదీక్షచే వంశధార నుండి పెన్న వరకు వేనోళ్ళ వినుతింపబడు శారదాంబా జమీందారిణి గారి మనుమరాలగుటచే నామె పోలిక లన్నియు పుణికిపుచ్చుకొన్నది.

‘తల్లీ శారదాంబా! ఈ దీపం నువ్వు పెట్టినదమ్మా! ఈ బిడ్డలు నీ వారమ్మా! ఈ వంశము నువ్వు నిలిపినదమ్మా’ అని యీ నాటికిని జమీందారు గారి తల్లి నెన్నియో వేలమంది జనులు తలచుకొని మొక్కుచుందురు. జమీందారు గారి తండ్రి జీవించియున్నప్పుడును, ఆయన కీర్తిశేషులైన వెనుకను, జమీందారుగారి చిన్నతనములోను, జమీందారు గారు పెద్దలై రాజ్యభారము వహించిన