పుట:Narayana Rao Novel.djvu/198

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అ ఇ ఉ ణ్ ఋ ఌ క్

197

వేగము! వేగము! రైలు సంగీతము పాడునా! ఒకొక్కప్పుడు రైలు తాళము వేయుచున్నట్లు తనకు తోచును. ఎంత చిత్రమో? టక టక టక టక. శారద మెరపువలేమాత్రమే తోచినది. నారాయణుడు పాడుకొన్నాడు.

ఓహో కవిత్వమా, నీవు విశ్వమోహినివి. శివుని డమరుకమున జనించితివా?

‘అ ఇ ఉ ణ్ ఋ ఌ క్.’

ఈ రైలుచక్రముల చప్పుడు అందుండియే జనించినదా?

‘అ ఇ ఉ ణ్ ఋ ఌ క్.’

‘శ్రీవాణీగిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాజేషుయే.’

కవిత్వము సర్వకళాస్వరూపము. కవిత్వము విశ్వస్వరూపము. సర్వ సృష్ట్యాత్మకము. అఇఉణ్ఋఌక్. టక టక టక టక. ఆతడు నిద్రగూరినాడు.