పుట:Narayana Rao Novel.djvu/114

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
113
జ పా ను

అర్జున: హిందూదేశములో వున్న క్రైస్తవులూ హిందువులే.

లియో: ఏలాగు?

అర్జున: అమెరికా దేశములో జ్యూమతస్థులున్నారు. మహమ్మదీయులున్నారు. బౌద్ధులున్నారు. వీరందరూ అమెరికనులే. హిందూదేశములోని వారంతా హైందవులు.

డా. రౌనా: (నవ్వుచు) అలాగా! అయితే క్రైస్తవులూ, మీరూ హిందూమతస్థులు కారన్నమాట.

అర్జున: మామతం సర్వమత సమ్మతము. అన్ని మతాలను తల్లివలె హిందూమతం కడుపులో పెట్టుకుంటుంది. హిందూమతంలో ఉన్న లోటును తీర్చడమునకు శ్రీ నానకు సింగు గురుమహారాజ్ సిక్కుమతము ఉద్భవింప జేశారు. కాబట్టి సంఘసంస్కరణరూపమైనది మా మతం. అలాంటి అంతర్మతాలే బౌద్ధ జైనమతములున్ను, ఇప్పటి బ్రాహ్మసమాజము, ఆర్యసమాజము, సత్సంగసమాజము మొదలైనవిన్నీ.

లియో: ఈ సంఘసంస్కరణ మతాలలో బ్రాహ్మణు లున్నారా?

అర్జున: లేరు. ఈ మతాల్లో చేరిన వారికి వర్ణ భేదము ఉండదు.

డా. రౌనా: ఒక సంఘమువారికీ ఇంకో సంఘంవారికీ వివాహాలున్నవా?

అర్జున: లేవు. కాని ఏ పిల్లనైనా వారు చేసుకొనుట కభ్యంతర పెట్టరు. దానినిబట్టి వెలితప్పులేదు.

లియో: ఆంధ్రదేశం అన్నారు. అదేమిటి?

అర్జున: హిందూదేశములో పదిహేనో పదహారో పెద్దభాష లున్నవి. అందులో ఆంధ్రభాష లేక తెలుగుభాష ఒకటి. ఆ భాష మాట్లాడే జనులు మూడుకోట్లపైన ఉన్నారు.

లియో: అమెరికాలో ఏమి చదువుకొనుటకు వచ్చుచున్నారండి రామచంద్రరావు గారూ?

రామ: ఆఁ... ఉఁ... లెక్క లండి.

లియో: ఏ విశ్వవిద్యాలయములో?

రామ: జపానులో స్నేహితులు యేల్ విశ్వవిద్యాలయములోనో లేక హార్వర్డులోనో చేరమన్నారు.

లియో : మీ దగ్గిర శిఫారసు ఉత్తరా లున్నాయా ?

రామ : నాలుగైదున్నాయండి.

లియో : హార్వర్డులో చేరండి. నేను ఎమ్. ఏ. చదువుచున్నాను, విద్యుచ్ఛక్తి అభిమానశాస్త్రంగా. తర్వాత అమెరికాకు శాస్త్ర పరిశోధనములో