పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సందీప్ వోహ్రా అనే మానసిక రోగచికిత్సకుడు “ఈరోజుల్లో అందమే విజయానికి టికెట్ ఔతుంది. యువజనం తాము అందంగా వుంటే చాలు ఏమైనా సాదించవచ్చు అనే అభిప్రాయానికి వచ్చారు. మన ప్రకటనల్లో కన్పించే కళాకారిణులు కష్టపడి చదువుకోవడం వల్ల కాక తమ ఆకారం వల్లనే ప్రసిద్దులౌతున్నారు" అని వ్రాశాడు. ఇంకా కూగ్ అనే వైద్యనిపుణుడు "ఈ కాలపు తారలు ఏవో గొప్ప పనులు చేసినందుకు గాక అందంగా పుట్టింనందుననే ప్రసిద్దులయ్యారు. లోకంలో అందచందాలకు అంతులేని ప్రాముఖ్యం వచ్చింది. యువత సుందరమైన ఆకృతి వుంటే చాలు విజయాన్ని సాధించవచ్చు నని భావిస్తుంది" అని వ్రాశాడు. ఈ నిపుణుల అభిప్రాయాలు కొంతవరకైనా సత్యమేనని చెప్పాలి. రూపానికి విలువా, ప్రాముఖ్యమూ వున్నాయి. ప్రాచీన కాలంలోనే అరిస్టోటల్ “అందం గొప్ప సిఫార్సు" అని వాకొన్నాడు.

1. యువత ఆందోళనం

నరులు తొలి మూడేండ్లు బాగా పెరుగుతారు. ఆ మీదట కూడ పెరుగుదల వున్నా అంత శ్రీఘ్రంగా పెరగరు. 11-18 ఏండ్ల మధ్య మళ్లా త్వరగా పెరుగుతారు. ఈప్రాయంలో యువజనం వాళ్ల దేహం పట్ల విశేష శ్రద్ధ చూపుతారు. శరీరాకృతి, రంగు, సోయగం అతిముఖ్యమని తలుస్తారు.


యావనంలో వున్నవాళ్లు తమ శరీరాలు నాజూకుగా లేవేమోనని కలవరపడుతుంటారు. పదే పదే అద్దంలోకి చూచుకొంటారు. ముఖం మీద మొటిమలు వస్తే సహించలేరు. కొందరు తమ ముక్కు కుదురుగా లేదని చింతిస్తుంటారు. మరికొందరు తమ చెవులు చాల పెద్దవిగానో లేక చిన్నవిగానో వున్నాయని ఆవేదనం చెందుతారు. ఇంకా కొందరు తమ కన్నులు ఆకర్షణీ యంగా లేవని బెంగపడతారు. తల మాటిమాటికి దువ్వ కొంటారు. జట్టుకి ఈయరాని ప్రాముఖ్యమిస్తారు. ఇంకా తమ కాళ్లు, చేతులు, నడక, రంగు మొదలైనవాటిని గూర్చి కూడ అతిగా ఆలోచిస్తారు.

కొందరు టీవీ, సినీ తారలను మనం వాళ్లలాగ చక్కదనానికి