పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కోల్పోతాం. దేనిలోను తొందరపాటు పనికిరాదు. లైంగిక విషయాల్లో అసలే పనికిరాదు.

యువతీయువకులు పిచ్చి కుతూహలంతో లైంగిక ప్రయోగాలకు పూనుకోగూడదు. ఈ ప్రయోగాలు మనకు ఇతరులకూ కూడ శారీరకంగాను మానసికంగాను చాల చెరుపు చేస్తాయి. తర్వాత అనేక అనర్ధాలకు దారితీస్తాయి. కొన్నిసార్లు తోడి యువతీయువకులు సెక్సును గూర్చి తమకు తెలిసీ తెలియని విషయాలన్నీ చెప్తుంటారు. ఆ సుద్దులన్నీ మనం నమ్మకూడదు. ఈ సందర్భంలో అనుమానాలు సందేహాలు కలిగి విషయం స్పష్టంగా తెలిసికొందాం అనిపిస్తే విద్యాసంస్థలోని కౌన్సిలర్ని సంప్రతించడం మంచిది.

భగవంతుడు మనకు దయచేసిన లైంగిక వ్యవస్థ అనే బహుమతికి వందనాలు చెప్పకోవాలి. తోడివారు మనకిచ్చిన బహుమతికి కృతజ్ఞలమై యుంటాం. దాన్ని చక్కగా వాడుకొంటాం గూడ. ఆలాగే భగవంతుడు దయచేసిన వరానికి గూడ కృతజ్ఞలమైయుండాలి. అసలా ప్రభువు సెక్సు అనే వరాన్ని మనకెందు కిచ్చాడా అని ఆలోచించాలి. దాన్ని గౌరవమర్యాదలతో చూచి తగిన సమయం వచ్చినపుడు చక్కగా వినియోగించు కోవడానికి సంసిద్దులం కావాలి. సెక్సుపట్ల సదవగాహనం కలిగించు కోవడమంటే యిదే.

11.అందచందాలు లేకపోతే కుమిలిపోవాలా?

2000 సంవత్సరంలో 170 వేలమంది అమెరికను యువతీ యువకులు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొన్నట్లుగా వార్తలు వచ్చాయి. వీరిలో ఎక్కువమంది ముక్కుమీద ఆపరేషను చేయించుకొన్నారు. టీవీ, సినీ తారలతో పోల్చుకొని తమ అందాన్ని ఇనుమడింపజేసికోవడానికి ఈ యాపరేషన్లు చేయించుకొన్నారు.

మనదేశంలో కూడ ఈ వెర్రి అక్కడక్కడ కనిపిస్తుంది. 1999లో మాయ అనే యువతి తన ముక్కుఅందాన్ని పెంచుకోవడానికి సర్జరీ చేయించుకోగోరింది. తాను అందంగా లేనన్న అశాంతితో ఆమె ఆత్మహత్యకు కూడ పాల్పడింది.