పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
1. సరుల జీవితంలో ఎన్మిది దశలు


నరుల జీవితంలో నాలు దశలుంటాయి. అవి బాల్యం, యావనం, నిండు వయస్సు, వృద్ధాప్యం. కొదరు మూనసిక శాస్త్రజ్ఞలు ఈ దశలను ఎన్మిదిగా విభజించారు. వీటిని గూర్చి తెలిసికొని వుండడం అవసరం.

1. పసిప్రాయం - 6

తొలి ఆరేండ్లు ఈ దశ క్రిందికి వస్తాయి. నరుల జీవితంలో ఇది ముఖ్యమైన దశ. దీన్ని బట్టే మిగతా జీవితమంతా వుంటుంది. శిశువుకి తల్లిందద్రులూ పెద్దలూ అనేక ఆజ్ఞలు విధిస్తారు. ఏమిచేయాలో, ఏమి చేయ కూడదో చెప్తారు. కథలు విన్పిస్తారు. వీటన్నిటి ద్వారా పిల్లలు తమ భవిష్యత్తును నిర్ణయించుకొంటారు. మొక్క చెట్టయినట్లుగా క్రమేణ నరులుగా మారతారు. బాల్యాన్ని బట్టే పిల్లవాడు భవిష్యత్తులో ఎలాంటివాడవుతాడో చెప్పవచ్చు. 2. యావనానికి ముందు దశ 6-12 ఈ దశలో పిల్లలు బడికి వెళ్తారు. ముందటి దశలోని భావాలు ఇక్కడ బలపడతాయి. పిల్లలకు బల్లో ఇతర పిల్లలు తటస్థపడతారు. వారి నుండి కొన్ని విషయాలు నేర్చుకొంటారు. విశేషంగా ఉపాధ్యాయులు తగులుతారు. వీళ్లు రోజూ పిల్లలకు పాఠాలు చెప్పి వారి ప్రవర్తనను తీర్చిదిద్దుతారు. తల్లిదండ్రుల స్థానంలో వుండి భావిమార్గాన్ని నిర్దేశిస్తారు. ఇక్కడే విద్యార్థులు వ్రాయడం, చదవడం, లెక్కలు చేయడం మొదలైన ప్రాథమిక విద్యలు నేరుస్తారు. వారికి లోకంలో నే నొక్కడనే గాక ఇతరులు కూడ వున్నారు అనే భావం కలుగుతుంది. నేను బాగా వున్నానా, ఇతరులు బాగా వున్నారా అనే ప్రశ్నలు కూడ జనిస్తాయి. స్కూలు ఇంటిపట్టున లేని అవకాశాలు ఎన్నో కలిగించి పిల్లలకు జ్ఞానం అలవడేలా చేస్తుంది. 1-2 దశలు బాల్యంక్రిందికే వస్తాయి.

3. యావనదశ 12-18

ఈ దశలో పిల్లలు యువతీయువకులు ఔతారు. ప్రీపురుషులుగా ○