పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబంలో అనైక్యత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులు నిత్యం దీని ముందు కాలం గడపడం వల్ల కలిసి మెలసి జీవించలేక పోతున్నారు. అనుబంధాలు, అన్యోన్యత క్షీణిస్తున్నాయి. ఇది విద్యార్థుల చదువును చెడగొట్టే సాధనమైంది. చానళ్లను ఎన్నుకోవడంలో తగాదాలు వస్తుంటాయి. టివి వల్ల యువతరం పాశ్చాత్య నాగరికత మోజులో పడిపోతున్నారు. స్వదేశ సంప్రదాయాలు మరుగున పడిపోతున్నాయి. టివిలో వచ్చే ప్రకటనలకు మభ్యపడి పేదజనం కూడ వస్తువులు అవసరం లేకున్న కొనేస్తున్నారు. వస్తు వినియోగం పెరిగిపోతుంది. నరులు క్రియాపరులుగా వుండాలి. కాని టివి చురుకుదనాన్ని చంపివేసి నరులను నిప్రియాపరులను చేస్తుంది.


ఈలా టివి వల్ల లాభాలెన్నో నష్టాలు కూడ అన్ని వున్నాయి. అది ఓ వైపు ఇడియట్ బోక్స్. మరోవైపు సమాచార కల్పవల్లి, దాన్ని వివేకంతో వాడుకోవాలి.


7.కౌన్సిలరుని సలహా అడగవద్గా?

మన జీవితంలో మూడు పర్యాయాలు పెద్ద మార్పులు వస్తాయి. మొదటిసారి మనం శిశుదశనుండి బాల్యదశకు చేరుకొన్నప్పడు. రెండవసారి బాల్యంనుండి యావనదశకు వచ్చినపుడు. మూడవసారి వృద్ధాప్యం చచ్చినప్పడు. ఈ దశలు మారుతున్నపుడు ఓ విధమైన ఘర్షణకు గురౌతాం. ఒకవైపు నూత్న దశలో ప్రవేశింప గోరుతాం. మరోవైపు పూర్వదశకు అంటుపెట్టుకొని వుంటాం. దానిలోనే భద్రత వందనుకొంటాం. పైమూడు మార్పుల్లో కష్టమైంది యావనదశలో వచ్చేమార్పు.


బాల్యదశలో తల్లిదండ్రులు పట్టించుకొని మన అక్కరలన్నీ తీరుస్తారు. మనకు ఏ బాధ్యతలూ వుండవు. బాల్యం స్వర్గంలో వున్నట్లుగా వుంటుది. కాని ఈ దశ తర్వాత యావనం వస్తుంది. ఈ ప్రాయంలో మన అక్కరలు మనమే తీర్చుకోవాలి. మన పనులు మనమే చేసికోవాలి. చాల బాధ్యతలు నెత్తిన పడతాయి.