పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గంటలు కొనసాగుతుంది. దేని ప్రత్యేకత దానికుండదు. సినిమాలు మన ప్రజల సమస్యలను లోతుగా పరిశీలించి చూపించవు. సమస్యలకు పరిష్కారాలు చూపించవు. డబ్బు చేసికోవడమే సినీ నిర్మాతల ప్రధానధ్యేయం. మన ప్రజలకు విద్య లేదు. విమర్శనా దృష్టి తక్కువ. కనుక సినిమావాళ్లు చూపించిందే వేదం అనుకొంటారు. కొన్ని సినిమాల వల్ల ప్రజల అభిరుచులూ పోకడలూ దిగజారి పోతున్నాయి. మానవ జీవితం ఔన్నత్యాన్ని అందుకోవడానికి బదులుగా పతనం అంచులను చేరుకొంటూంది.

ఐనా సినిమా మన ప్రజలకు సులువుగా, చౌకగా లభించే వినోద సాధనం. పేదసాదలూ, సామాన్య జనమూ సినిమాల వల్ల నిజంగా విశ్రాంతీ ఉల్లాసమూ పొందుతున్నారు. అవి కూడ లోపిస్తే వాళ్ల బ్రతుకులు భారమౌతాయి.

4. టి.వి.

మన సమాజంలో టీవీ ప్రభావం చాల యెక్కువే. వేలకొలది ప్రజలు దినమంతా టీవికి అతుక్కొని వుంటారు. దాని వల్ల వినోదాన్ని పొంది సేదతీర్చు కొంటారు. కొంతమంది విద్య సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షిస్తారు. కొందరు వార్తల కొరకు వేచివుంటారు. విద్యార్థులు క్రికెట్ మాచి కొరకు కాచుకొని వుంటారు. పల్లెటూరి రైతులు వ్యవసాయ కార్యక్రమాలు చూస్తారు. వాతావరణ పరిస్థితులు తెలిసికొంటారు. పట్టణ ప్రజలు సినిమాలకు ఎగబడతారు. నేషనల్ జాగ్రాఫిక్ ప్రోగ్రాం కొందరిని ఆకర్షిస్తుంది. గృహిణులకు టివి మంచి కాల వ్యాపనం, మన దేశం భిన్న మతాలకూ, సంస్కృతులకూ, భాషలకూ ఆలవాలం. టీవీ ఈ దేశంలో జాతీయ సమైక్యతను పెంపొందించే సాధనం. అది పల్లె ప్రజలను విద్యావంతం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ప్రభుత్వాలూ, ఎంజీవోలూ ప్రజలను చైతన్య పరచడానికి టీవీ ఉపయోగించు కొంటున్నారు. పౌరులకు వారి హక్కులనూ బాధ్యతలనూ గుర్తు చేస్తున్నారు. వ్యాధులను గూర్చిన సమాచారాన్ని అందిస్తున్నారు. ఈలా టివి వల్ల ఉపయోగాలు చాల వున్నాయి.

ఐనా ఈ మాధ్యమం చాల దుష్పలితాలను గూడ తెచ్చిపెట్టింది. దీనివల్ల