పుట:NagaraSarwaswam.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

75


ణంగా చామనచాయ అయివుంటుంది. చంద్రదర్శనంవలె వీరిదర్శనం కన్నులకు మనస్సుకు చల్లదనం చేకూర్చేదై వుంటుంది. వీరి దంతాలు మాత్రం పెద్దవిగా వుంటాయి. కంఠధ్వనిపెద్దదిగా ఉండదు, శిరస్సుపై జుట్టు దట్టంగా వుంటుంది. శరీరం శ్లేష్మతత్త్వ ప్రధానమై వుంటుంది. ఈ జాతి స్త్రీలు ఆహారం స్వల్పంగా స్వీకరించేవారై వుంటారు. వీరికపాల భాగము గూఢంగా వుంటుంది. ముఖము నున్నగా వుంటుంది. రతివేళ వీరియోనినుండి స్రవించేరజస్సు సునాసనలు చిమ్ముతుంది. ఇట్టిలక్షణాలుకల స్త్రీలను హరిణీజాతి స్త్రీలుగా గుర్తించాలి.

బడబాజాతి స్త్రీలు:- ఈజాతి స్త్రీల శరీరం పచ్చగా వుంటుంది. వీరి శరీరము పిత్త (పైత్య) తత్త్వప్రధానమైనది. బలిసి కఠినంగా వుండే స్తనద్వంద్యం కలిగి వుండడం యీ జాతిస్త్రీల సహజలక్షణం. వీరి చేతి యెముకలు, కాలి ఎముకలు, మడతకీళ్ళు, మడములు కొంచెం వంకర తిరిగి వుంటాయి. చేతులు మృదువుగా మాంసలములై పుష్టిగా వుంటాయి. వీరికి చెమట యెక్కువ. సన్నని నడుము సమానములైన అవయవములు కలిగి యీజాతి స్త్రీలు మెరుపు దీవలవలె మన్మధుని చికిలిచేసిన శస్త్రాలవలె మెఱుస్తూ ఉంటారు. రతివేళ వీరియోనినుండి స్రవించేరజస్సు మాంసముయొక్క వాసనవంటి వాసనకలదిగా ఉంటుంది.

హస్తినీజాతి స్త్రీలు:- యీజాతి స్త్రీలు మిక్కిలిపొడవుగా వుండరు, కొంతకుకొంత పొట్టివారనియే నిర్ణయం. లావుగా మాత్రం వుంటారు. వీరితలమీద వెండ్రుకలు నల్లగా వుంటాయి. అంతేకాదు ప్రతి వెండ్రుక మిక్కిలి లావుగా వుంటుంది. వీరి శరీరచ్ఛాయ ఎఱుపు. శరీరతత్త్వం వాత ప్రధానంగా వుంటుంది. బలిసినచేతులు, పాదాలు కలవారై ఒకప్పుడు చల్లగా, వేరొకప్పుడు వెచ్చగా వుండే శరీరము కలవారై, యెక్కువగా మాట్లాడే స్వభావము కలవారై యీజాతి స్త్రీలు చంచలంగా వుంటారు. వీరిశరీరంలో క్రొవ్వుచాల ఎక్కువగావుంటుంది. వీరియోని అధికమైన రోమపంక్తితో నిండివుం