పుట:NagaraSarwaswam.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

74


పలుచని నడుము, పలుచనైన చెవులు కలిగి వీరుమిక్కిలి సుకుమారంగా వుంటారు. వీరియొక్కవీర్యం సువాసనా భరితమై వుంటుంది.

వృషభజాతి పురుషులు:- ఈ జాతి పురుషుల శరీరముకూడ కాంతిమంతముగానే ఉంటుంది. కాని వీరు శశజాతి పురుషులవలె సుకుమారంగా కాక తగినంత పుష్టికలవారై ఉంటారు. వీరి మెడ స్థూలంగా ఉంటుంది. వీరి చేతులు పాదాలు కూడ ఎఱుపులు చిమ్ముతూ ఉంటాయి. వీరి నేత్రాలలో చాంచల్యం ఉండదు. కన్నులలో స్థిరత్వమే ఎక్కువ కనబడుతుంది. కంటి రెప్పలకు దట్టముగ రోమాలు ఉంటాయి. వీరి కడుపు తాబేటి కడుపును పోలిఉంటుంది. మాటలు మృదువుగా ఉంటాయి. మొత్తానికి శరీరంలొని అన్ని భాగములయందు క్రొవ్వునిండి ఉండి వీరు చాల పుష్టిగా కానవస్తారు.

అశ్వజాతిపురుషులు:- పై శశజాతి వృషభజాతి పురుషుల కంటె వీరు భిన్నంగా ఉంటారు. వీరి శరీరం కాంతిమంతమై ఉండదు. శరీరములో తగినంత పుష్టికూడ ఉండదు. వీరిశరీరావయవాలు మిక్కిలి పొడవుగా ఉండి తగినంత మాంసములేనివై కృశించినట్లు ఉంటాయి. ముఖ్యంగా ముఖము, చెవులు, శిరస్సు, పెదవులు వీనియందు ఈ దీర్ఘత్వము కృశత్వము గోచరిస్తాయి. వీరి తలమీద జుట్టు దట్టంగా వుంటుంది. అవయవాలన్నీ కూడ కొంతకు కొంత వంకరగా వుంటాయే కాని చక్కగా తీర్చి దిద్దినటులుండవు. కాలి పిక్కలయందు, పాదముల ఈ వక్రత అధికంగా కానవస్తూంది. వీరివ్రేళ్ళు పొడవుగా వుంటాయి. కంఠధ్వని మేఘధ్వనిని (ఉరుము) పోలి వుంటుంది. నేత్రాలు చంచలంగా వుంటాయి. తొడలు బలిసివుంటాయి వీరు వేగంగా నడచేవారై వుంటారు. ఈ లక్షణాలుకలవారిని అశ్వజాతి పురుషులుగా గుర్తించాలి.

హరిణీజాతి స్త్రీలు:- ఈ జాతి స్త్రీలు లలితమైన శరీరము కలిగివుంటారు. వీరిశరీరము సన్నగా ఉంటుంది. శరీరచ్ఛాయ సాధార