పుట:NagaraSarwaswam.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

59

"భార్యా భర్తలిద్దరియందు సంభోగ సమయంలో భార్యకంటె ముందుగా భర్త ప్రవృత్తుడవుతాడు. స్త్రీ తన బిగింపును వదలి ముందుగా సిద్ధంకావడం అనేది ఎన్నడోకాని జరుగదు. కోర్కె ఉన్నా తనంతతానై ప్రవర్తించకపోవడం స్త్రీలయొక్క లక్షణం, ఈ సహజ లక్షణాన్ని విడచి భార్య తానే ముందుగా పతిని అతడు కోరకుండగానే కౌగలించుకొని ముద్దుపెట్టుకొనడం, సంభోగ మధ్యంలో తనంత తానుగా భర్తను క్రిందుజేసి పురుషాయితం (పురుషునివలె ఆచరించడం) చేయడంవంటిది జరిగితే అది శృంగారభావంనుండి పుట్టిన "హేల" అనే చేష్టగా గుర్తించాలి. ఈ హేల పురుషునకు మిక్కిలి ఆనందాన్ని ఇచ్చేది అవుతుంది. పురుషుడు తన వర్తనంద్వారా భార్యయొక్క మానసంలోని శృంగారభావాన్ని అధికంగా దీప్తంచేసిన మీదట మాత్రమే భార్య యీ చేష్టను ప్రదర్శిస్తుంది.

2 విచ్ఛిత్తి : భర్తచేసిన అపరాధం కారణంగా భార్యతాను అలంకరించుకొనుట మానినదై, చెలికత్తెలు అలంకరింపబూనుకొన్నా తిరస్కరించడం జరిగితే ఆ చేష్ట "విచ్ఛిత్తి" అనబడుతుంది. కొందరు "భర్త పిలుస్తూఉన్నా సిగ్గుచే సమాధానం చెప్పనిదై భార్య ఉంటే ఆ స్థితి విచ్ఛిత్తి అనబడుతుంది" అంటారు.

"ఓసి చెలీ! నీ పతి ఏదో చిన్న తప్పిదం చేశాడేఅనుకో! అయినా ప్రియుని విషయంలో ఇంత అలగడం తగదు. ప్రేమించినవారిని క్షమించడంకూడ నేర్చుకోవాలి. అలకరించుకోనంటావేమిటి? నేను జడ వేస్తాను, ఇలారా! అని చెలికత్తె అంటూ ఉన్నపుడు, అలంకరించడానికి పూనుకొన్నపుడు- "నాకు జడ అక్కరలేదు, నేను అలంకరించుకో నక్కరలేదు, నీవునాకు బలవంతంగా జడవేస్తావా ఏమిటి, లాగుతున్నావా"- అంటూ త్రోసి పుచ్చడం జరిగితే దానిని "విచ్ఛిత్తి" అనే శృంగార చేష్టగా గుర్తించాలి.

3 కిలికించితము : చిరకాలానికి వచ్చిన భర్తను చూచిన ఆనందాతిరేకంలో భార్య క్షణకాలం చిరునవ్వునవ్వి, క్షణం ఏడ్చి కండ్ల