పుట:NagaraSarwaswam.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

ఒక యువతి ఒక యువకునివంక జూచి కొద్దిగా చిఱునవ్వు నవ్వడం మాత్రమేజరిగితే, అక్కడ శృంగారభావం అల్పంగా మాత్రమే వ్యక్తమైనటులు గుర్తించాలి.

ఒకయువతి ఒకయువకునివంకజూచి కేవలం చిరునవ్వు నవ్వుటయే కాక పులకించిన శరీరం కలదికూడ అయితే శృంగారభావం చాలవరకు వ్యక్తమైనటులే గుర్తించాలి.

యువకునివంకచూచి యువతి-పులకించిన శరీరంకలది కావడమే కాక, నిట్టూర్పులు విడచిపెట్టడంవంటివికూడ జరగితే ఆభావంఅధికంగా వ్యక్తమైనటులు గుర్తించాలి. కామినీకాముకులు తాము పిలచినవారియందు శృంగారభావం ఏ అంతరువులో వ్యక్తమై ఉన్నదో గుర్తించాలి. అది తక్కువగా, లేక సాధారణంగా ఉంటే తమ వర్తనంద్వారా దానికి దోహదం చెయ్యాలి. ఎంతో కాలంగా కలిసిమెలసి కాపురం చేసుకొంటూఉన్న ఆలుమగలుకూడ శృంగారభావంయొక్క అధికదీప్తిని గమనించి వ్యవహరించినపుడు మాత్రమే ఎక్కువ ఆనందాన్ని పొందగలుగుతారు. శృంగారభావం అధికంగా దీప్తమైనపుడు స్త్రీ పురుషుల చేష్టలయందు మార్పువస్తుంది. ఈ చేష్టలద్వారా దాని దీప్తిని గమనించవచ్చును. వీనిని గుర్తించడం, గుర్తించి వ్యవహరించడంవల్ల భార్యా సాంగత్యంలో భర్తకు, భర్తయొక్క పొందులో భార్యకు మిక్కిలి ఆనందం కలుగుతుంది. ఈ చేష్టలు పదునారు రకాలుగా విభజింపబడ్డాయి. 1 హేల. 2 విచ్ఛితి. 3 కిలికించితము. 4 విభ్రమము. 5 లీల. 6 విలాసము. 7 హానము. 8 విక్షేపము. 9 వికృతము. 10 మదము. 11 మోట్టాయితము. 12 కుట్టమితము. 13 ముగ్ధత్వము. 14 తపనము. 15 బిబ్బోకము. 16 లలితము- అని వానిపేర్లు. వీనియొక్క లక్షణాలు ఉదాహరణాలు దిగువ నీయబడుతున్నాయి.

1 హేల:- సంభోగేచ్ఛ ప్రబలంగాఉంటే ఆస్థితిని సూచించే చేష్టకే హేల అని పేరు.