పుట:NagaraSarwaswam.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

152


స్నేహితురాలు, పశువులయొద్ద బాగుచేయు వనిత, చేటిక (పనికత్తె) - వీరు దూతికలుగా వినియోగించుటకు తగినవారు.

పురుషుడు పరవనితకు ఒక సందేశం పంపదలచి ఒక పురుషునే ఈపనియందు వినియోగిస్తే - ఆమె స్త్రీ. ఈతడు పురుషుడు అయినందున ఈసందేశం అక్కడకు చేరడంలో అభ్యంతరాలు ఎక్కువగా యేర్పడతాయి. అంతేకాక ఈపనిని ఆచరించేవాడుకూడ పురుషుడే అయినందున ఆ ఆనందం తానే జుర్రుకొని కూర్చోవచ్చు. అందుచే పరస్త్రీని పొందగోరే పురుషుడెన్నడూ వేరొక పురుషుని (సులభసాధ్యలైన స్త్రీల విషయంలో స్నేహితుని వినియోగించినట్లు) దూతకర్మలో వినియోగించకూడదు. అనగా స్త్రీలనే వినియోగించాలి. ఆస్త్రీలైనా ఆవనిత వుండేచోటుకు ఎక్కడో దూరంగా వుండేవాళ్ళు. ఎప్పుడో కాని ఆమె ఇంటికి రావడానికి వీలులేనివారు అయితే వారివల్లకూడ పని సాధింపబడదు. అట్టివారు ప్రత్యేకం ఈపనిమీద మాటి మాటికి రాకపోకలు సాగిస్తే - "ఈమె అంతదూరం నుండి పనిగట్టుకొని రోజూవస్తోంది. కారణం ఏమిటి?" అన్న శంక ఇతరులకు కలిగి కార్యభంగం అవుతుంది.

అందుచే మామూలుగా ఆఇంటిలోనికి వెళ్ళడం అలవాటున్న వారినే దూతికలుగా వినియోగించాలి. ఇంటిచాకలి వస్తే యెవరికీ అనుమానం కలుగదు, ఆచాకలి స్త్రీయైయున్నందున ఆడవారిఎదుట నిస్సంకోచంగా వ్యవహరిస్తుంది. ఆయింటిలోని ఆడవారుకూడ ఆచాకలిఎదుట ఏవిధమైన చెరుకుదనము లేనివారై ఉంటారు. అందుచే చాకలికి యేదో అవకాశం చూచుకొని పరపురుషుని సందేశం చేరవేయడానికి వీలు యెక్కువగా ఉంటుంది. ఇంటిలో నిత్యమూపనిచేసేదాసి పశుల దగ్గర బాగుచేసే వనిత, అప్పుడప్పుడు ప్రత్యేకపుపనుల ఒత్తిడి కలిగినపుడు వెళ్ళి పనిచేసే చేటిక - ఈముగ్గురుకు కూడ పరపురుష సందేశం అందజేయడానికి అవకాశాలు ఎక్కువ. ఆవనిత ఉండే ఇంటికి