పుట:NagaraSarwaswam.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

153


పొరుగున నివసించే స్నేహితురాలైన వనితకుకూడ ఇట్టి అవకాశం ఉంటుంది. ఇక పూవులు, అమ్మే వనితలు ఇంటింటికి వెడుతూ ఉంటారు. గనుక వారి రాకపోకలు ఎవరికీ అనుమానం కలిగించవు . కొందరు స్త్రీలు-'యోగమని, యోగాభ్యాసమని, ఆత్మ, పరమాత్మ అని కబుర్లు చెపుతూ ఆయోగంలో కొంత ప్రవేశం కలవారై ఉంటారు. అట్టి స్త్రీలకు స్త్రీలలో కొంత గౌరవము ఆదరము ఎక్కువగాఉండి వారు అందరి యిండ్లకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఈవిధంగా యోగినులైన స్త్రీలుకూడ పరపురుష సందేశం భద్రంగా చేర్చి కార్యసఫలతను సాధించకలవారై ఉంటారు. అందు చేతనే దూతికలుగా వీరినే వినియోగించవలెనని చెప్పబడ్డది.

వీరినైనా యోగ్యత చూచికాని పురుషుడు వినియోగించ కూడదు. తగినంత యోగ్యత లేనివారి వలన పని చెడుతుంది.

దూతికా యోగ్యతలు

దూతిక గడుసుదనం కలదై ఉండాలి. ఇతరుల మనస్సులోని భావాలను వారి ముఖంమీదనే చదువగల నేర్పు మిక్కిలిగా కలదై ఉండాలి, ఈయోగ్యతలు లేనినాడు దూతిక వెనుక చెప్పబడినవారిలో ఒకతె అయి ఉన్నా ప్రయోజనం లేదు. అందుచే పురుషుడు ఈలక్షణములు కలవారినే దూతికలుగా వినియోగించాలి. ఎందువల్లనంటే దూతీకృత్యము మిక్కిలి సున్నితమైనది.

దూతీకృత్యము

దూతిక తగు సమయం చూచికాని తాను చెప్పదలచిన ఆపరపురుష సందేశం ఆ పరవనితకు చెప్పకూడదు. ఈ సందేశం చెప్పడానికి ముందు దూతిక ఆవనితతో కామగుణాన్ని వృద్ధిపరచే మాటలు మాట్లాడాలి. ఆమె మాటలు తీయగా-రసవంతంగా - విన్నంతనే ఏవో ఆనందలోకాలలోనికి తీసికొని పోయేవిగా మన్మధభావోద్దీపకాలుగా ఉండాలి. ఇట్టిమాటలు చెప్పి చెప్పి, ఆపురుషుని గుణగణాలు వర్ణించి వర్ణించి, ఆతనితోడి పొందువలని సుఖాన్ని