పుట:NagaraSarwaswam.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

146


శరీరస్థితిచే ప్రదర్శించాలి. రతిక్రీడ ముగిసినమీదట కాంత ఎంత పరవశయై ఉన్నా మిక్కిలి శీఘ్రంగా భర్తయొక్క కంటబడకుండునటు తన జఘనభాగాన్ని (మొలముందు ప్రదేశము) వస్త్రముతో కప్పుకొనాలి. క్రీడా సమాప్తియందు చిక్కులుపడిన తన జుట్టును, అలసటను సూచించుచు చెమటతో దోగిన కన్నులను ప్రదర్శించినట్లు వనిత తన జఘనదేశాన్ని భర్తకు ప్రదర్శించకూడదు.

కాంతలందరు ఈ ఏకాంత ధర్మాలను గుర్తించి చరించాలి. వీనివలన వారిలోని నాజూకుదనం ప్రదర్శింపబడి వారు భర్తను ఆకర్షించగలవారు అవుతారు. లోకంలో కాంతానురంజనం (స్త్రీని సంతోషపెట్టుట) మిక్కిలి సున్నితమైనది. క్లేశముతోకూడినది. ఈఏకాంతధర్మాలను కాంతలు ఆచరించే తీరునుబట్టి పురుషుడు వారియొక్క తృప్తిని, అసంతృప్తిని గ్రహించి తగినట్లు వర్తించాలి. అప్పుడు భార్యాభర్తలు ఇద్దరును ఆనందమయజీవితం గడపగలుగుతారు.

★ ★ ★

పరదారగమనము

పరదార అనగా పరభార్య ' నపరదారన్‌గచ్ఛేత్ ' పరస్త్రీలను పొందరాదు. అని వేదము చెబుతోంది. పరస్త్రీలపొందు ఈ విధంగా వేదవిరుద్ధము, అధర్మము అయి ఉండగా కామశాస్త్ర గ్రంథముల యందు ఆపరస్త్రీని పొందడానికి, ఉపాయాలు చెప్పబడ్డాయి. అందుచే అవి నింద్యములయ్యాయి - అన్న వాడుకకూడ లోకంలోఉన్నది. కాని ఈవిషయం వాస్తవంకాదు.

పరస్త్రీని పొందరాదనియే సర్వకామశాస్త్రములు ఘోషిస్తూన్నాయి. కాని ఒక్కొక్కప్పుడు కామం మిక్కిలి ప్రబలంగాఉండి తాను వాంఛించిన స్త్రీని - ఆమె పరస్త్రీయేకావచ్చు - పొందలేక పోతే తన తనువుకే ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ పరిస్థితి ఎక్కడనోకాని ఏర్పడదు.