పుట:NagaraSarwaswam.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

128


యందు తనచేతి వ్రేళ్ళను ప్రవేశపెట్టుటకూడ శాస్త్ర సమ్మతమై యున్నది. దీనికే అంగుళీ ప్రవేశమనిపేరు. ఈ అంగుళీ ప్రవేశ విధానములు మొత్తం ఆరు. అందు మొదటిది కరణము.

1. కరణము:- భర్త భార్యయొక్క యోనియందు తన చూపుడు వ్రేలిని ప్రవేశపెట్టినచో దానికి ' కరణము ' అనిపేరు.
2. కనకము:- భర్త తన చూపుడువ్రేలిని తన నడిమి వ్రేలిమీద కెక్కించి భార్య యోనియందు ప్రవేశపెట్టినచో అది ' కనకము ' అనబడుతుంది.
3. వికనము:- కనకమునందువలెనే భార్యయొక్క యోనియందు ప్రవేశపెట్టిన వ్రేళ్ళను (చూపుడువ్రేలు, నడిమివ్రేలు) యోనియందేయుంచి మార్చుట - (అనగా నడిమి వ్రేలిమీదనున్న చూపుడువ్రేలిని దిగువచేసి నడిమివ్రేలిని చూపుడు వ్రేలిమీదకు ఎక్కించుట) మాటిమాటికి జరిగినచో అది ' వికనము ' అనబడుతుంది.
4. పతాక:- భార్య యోనియందు ప్రవేశపెట్టబడిన రెండు వ్రేళ్ళను ఒకదానికొకటి ఎడమగా విస్తరింపజేయుట ' పతాక ' అనబడుతుంది.
5. త్రిశూలము:- చూపుడువ్రేలు, నడిమివ్రేలు మాత్రమే కాక ఉంగరపువ్రేలిని కూడా భార్య యోనియందు ప్రవేశపెట్టి వానిని యోనియందే ఒకదానికొకటి ఎడము కావించినచో ఆస్థితి ' త్రిశూలము ' అనబడుతుంది.
6. శనిభోగము:- పైన చెప్పినవిధముగా భార్యయోనియందు ప్రవేశపెట్టిన మూడువ్రేళ్ళను ఎడముగాకాక దగ్గరగా చేర్చినచో ఆస్థితి ' శనిభోగము ' అనబడుతుంది.

ఈ అంగుళ ప్రవేశ విధానముల నారింటినికూడ పురుషుడు క్రమముగనే ఉపయోగించాలి. ఇట్లు అంగుళ ప్రవేశము చేయుటవలన