పుట:NagaraSarwaswam.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

129


వనిత ఎట్టిదైనను రతికి అభిముఖి అవుతుంది. ఆమెయందు సంభోగము కొరకైన ఒక పరమమైన విహ్వలత ఏర్పడుతుంది. ఈ అంగుళ ప్రవేశమువలన ఆమెయందు రతికొరకైన విహ్వలత ఏర్పడుతుందేకాని తృప్తి ఏర్పడదు. స్త్రీకి తృప్తి పురుషాంగ సంయోగముచేతనే లభిస్తుంది. ఈవిషయం పురుషుడు గ్రహించాలి. కేవలం అంగుళీ రతంతో మాత్రమే ఆచరించేవాడు పురుషాధముడు. రతిక్రీడయందు మిక్కిలి ఉత్సుకతను కనబరచని స్త్రీలవిషయమునందు మాత్రమే ఆవశ్యకత నెరిగి పురుషుడీ అంగుళీ ప్రవేశ విధానమును ఆచరించాలి.

క్రీడా తాడనము

సంభోగసమయములో స్త్రీపురుషులు సంయుక్తయంత్రులై రమించుచున్నవేళ భార్యను ప్రేమతో పురుషుడు ప్రహరించుట (కొట్టుట) కూడ జరుగుతుందని వెనుక చెప్పబడ్డది. ప్రహరణ తాడన శబ్దములు సమానార్థకములు. సుందరములై స్త్రీయొక్క నాడీమండలమును స్పందింపజేయగలవైన తాడనభేదములు పదునొకండు ఇందు తెలుపబడుతున్నాయి. ఈ తాడనభేదములయందు మొదటిది శబ్దకర్తనము.

1. శబ్దకర్తనము :- శబ్దకర్తనము అనగా కత్తిరింపు శబ్దము. భార్యయొక్క శిరస్సు ఈ తాడనమునకు స్థానమై ఉన్నది. పురుషుడు భార్యను కలిసి సంభోగాసనాసీనుడైయుండి ఆమె శిరస్సు మీద క్రీడగా తాడనముచేయ నెంచినపు డీ శబ్దకర్తన విధానమును అవలంబించాలి. చేతివ్రేళ్ళు నాల్గింటిని గుప్పిడిగా ముడవకయే కొంచెము వదులుగావుంచి చిటికెనవ్రేలియొక్క పార్శ్వభాగము శిరస్సునకు తాకునట్లుకొట్టగా - మిగిలిన మూడువ్రేళ్లును వదలుగా ఉన్నందున ఒక దానిమీద ఒకటి పడినవై ఒక శబ్దమును జనింపజేస్తాయి. ఆ