పుట:NagaraSarwaswam.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

122

3. అర్పితబంధము :- భార్యకు బదులు భర్తయే గోడనుఆనుకొని నిలచియుండగా - భార్య అతని కంఠమును కౌగలించుకొని - ఆతని అరచేతులలో తన పాదములనుంచి ఎక్కి నిలచినదై - తన మోకాళ్ళను భర్తయొక్క ఇరుపార్శ్వముల నుండియు పోనిచ్చి కొంచెము వంచియుండగా పురుషుడామెను కలియుటకు - అర్పితబంధమనిపేరు. ఇట్లు ఆచరించుటకు భార్యా శరీరభారము నరచేతులయందు మోయగల శక్తికలవాడైయుండాలి. దీనినే రతిరహస్యకర్త 'ద్వితలబంధము' అనెను.

4. దోలాబంధము :- భార్యకు బదులుగా భర్తయే గోడనానుకొని నిలచి కుడిచేతివ్రేళ్ళ సందులనుండి ఎడమచేతివ్రేళ్ళను పోవనిచ్చి ఉగ్గిలి పట్టుగా బిగియపట్టి దోసిలిని ఏర్పరచవలెను. అప్పుడు భార్య తనప్వష్ఠము నా దోసిలియందాల్చి కూర్చుండి - తనకాళ్ళను భర్తయొక్క నడుమునకుచుట్టక - భర్తయొక్క వక్షము మీదుగా పైకి పోనిచ్చి తాను చేతులతో ఆతని కంఠమును గ్రహించినదై యుండగా ఉన్నతమైన పురుషాంగముకల భర్త - ఉగ్గిలిపట్టుగానున్న తనచేతులతో భార్యా పృష్ఠమును పై కెత్తి క్రిందికి దించుచు రమించుట 'దోలాబంధము' అనబడుతుంది. ఈ బంధము నాచరించుటకు పురుషుడు తగినంత బలశాలియై యుండుటయేగాక స్త్రీయొక్క శరీరముకూడ తగినంత పలుచనదై లఘువుగా ఉండుట అవసరము. దోల అనగా ఊయెల. ఊయల ఊగుటవంటి స్థితి ఇందుండుటచే దీనికీపేరువచ్చెను.

5. విలంబితబంధము :- దోలాబంధము నందువలెనే పురుషుడు గోడనానుకొని నిలచియుండ గట్టిగా కౌగలించుకొన్నదై తనరెండుకాళ్ళను పైకెత్తి వానితో ఆతని నడుమును చుట్టి - తన యోనితో ఆతని పురుషాంగమును సంసక్త పరచుచుండగా ఏర్పడు రతిక్రీడను 'విలంబితబంధము' అని