పుట:NagaraSarwaswam.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

121


ఉత్థితకరణ భేదములు :

భార్య ఏగోడనో స్తంభమునో ఆధారముగా చేసికొని నిలచియుండగా పురుషుడామెనుగూడి రమించుట ఉత్థితకరణము. ఈ ఉత్థితకరణము, దీని తరువాదైన వ్యాసతకరణము చిత్రరతములు అనబడతాయి, వీని నాచరించుటకు దంపతులు శక్తి, చురుకుతనము, శరీరలాఘవము కలవారయి ఉండాలి, అట్లు తగినంత శరీరలాఘవము లేనివారికీ కరణభేదములు సాధ్యములుకావు. ఈ కరణభేదముల యందు ఆరు మాత్రమిచ్చట తెలుపబడుచున్నవి. వీనిలో మొదటిది 'హరివిక్రమబంధము'.

1. హరివిక్రమబంధము :- భార్య తనవీపును ఏ గోడకో ఆన్చి పాదములను గోడకు కొంచెము దూరములోనుంచి - ఏటవాలుగానున్న శరీరముకలదై నిలచియుండగా - పురుషుడామెయొక్క ఒకకాలిని ఆమె మొగముమీదుగా పోవునట్లు పైకెత్తి ఉన్నతమైన పురుషాంగము కలవాడై రమించుట 'హరివిక్రమబంధము' అనబడును. ఈ బంధమునందు భార్యయొక్క - ఒకపాదము నేలను తాకుచుండ వేరొకపాదము ఆమెయొక్క ముఖమును తాకుచుండును. హరివామనావతార సమయమున ఒకపాదముతో భూమినాక్రమించి, వేరొక దానితో ఊర్ధ్వలోకముల నన్నిటిని, (ఆకాశమును) ఆక్రమించెను కదా! అట్టిరూపము వనితకీబంధము నందేర్పడుతుంది, అందుకే దీనికి హరివిక్రమని పేరు వచ్చినది.

2. వ్యాయతబంధము :- యువతి హరివిక్రమబంధము నందు వలెనే నిలచినదై - ఉన్నతమైన పురుషాంగముతో తను గూడిన భర్తయొక్క - వెన్నుపూస తుదిభాగమును తనయొక్క ఒకపాదముతో తాకుచుండగా ఏర్పడు కూటమి 'వ్యాయతబంధము' అనబడుతుంది. దీనియందు వనితయొక్క ఒకపాదముమాత్రము నేలమీదఉంటుంది. రెండవపాదము పైకెత్తబడి భర్తయొక్క నడుమును చుట్టి అతని పిరుదులను తాకుతూవుంటుంది.