పుట:NagaraSarwaswam.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

101

5. రేఖాక్షతి : భార్యయొక్క తొడలపై పిరుదులపై వెనుక చెప్పిన వ్యాఘ్రపదము కంటె పొడవైన రేఖల నేర్పరచినచో అది రేఖాక్షతి అనబడుతుంది. ఈ క్షతి కొంచెము లోతుగా చేయబడుతుంది. భర్తయేదైన గ్రామాంతర మేగునపుడు పూర్వరాత్రమున భార్యయొక్క శరీరమునందిట్టి రేఖల నేర్పరచినచో ఆతడు వచ్చువరకు ఆ రేఖలు ఆమె కంటబడినపుడెల్ల ఆమెయందొక మధురానుభూతి కలుగుతుంది.

6. శశప్లుతము : భార్యయొక్క పిరుదులమీద, స్తనములమీద, మోకాలి వెనుక భాగమున పురుషుడు తన చేతి గోళ్ళనైదింటిని కలిపి ఒకేసారి గ్రుచ్చినచో అది శశప్లుతము అనబడుతుంది. శశ మనగా కుందేలు. కుందేలు గెంతినపుడు దాని పాద చిహ్నములు నేలమీద ఏర్పడతాయి. సరిగా అట్టిదైన ఆకృతి ఐదుగోళ్ళనుకలిసి గ్రుచ్చుటవలన ఏర్పడుతుంది. అందుచే దీనికి శశప్లుత మని పేరు వచ్చినది.

7. ఉత్పలపత్రము : ఉత్పలము అనగా కలువపూవు. పత్రం అనగా రేక. కలువ రేకలు మిక్కిలి దూరముకాక మిక్కిలి దగ్గరకాక దొంతులు దొంతులుగా ఉంటాయి. భార్యయొక్క స్తనములయొక్క అడుగుభాగమునందు పురుషుడు గోళ్లతో దగ్గర దగ్గరగా గ్రుచ్చి అట్టి రేఖలను ఏర్పరచినచో అది ఉత్పల పత్రము అనబడుతుంది.

8. మయూరపదము : మయూర పదము అనగా నెమలి కాలు. భార్యయొక్క స్తనములయందు లేక బుగ్గలయందు పురుషుడు,తన చిటికెనవ్రేలిని విడచిపెట్టి మిగిలిన నాలుగు వ్రేళ్ళతోడను పరస్పరము కలియునట్లు రేఖల నేర్పరచినచో అది మాయూరపదము అనబడుతుంది. అనగా బొటనవ్రేలిని భార్యా శరీరభాగమునందాల్చి యుంచి, మిగిలిన మూడు వ్రేళ్లను దూరముగాచాచి వానియొక్క గోళ్ళను కూడ శరీరభాగమునందాల్చి ఆమూడు వ్రేళ్లను, ఈబొటనవ్రేలిని కూడ పరస్పరము దగ్గరగా లాగవలెను అప్పుడు మయూరముయొక్క