పుట:NagaraSarwaswam.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100


నొక్కుట అర్ధచంద్రము అనబడుతుంది. సహజముగా ఏ గోటితోనొక్కినను అర్ధచంద్రాకృతి ఏర్పడుతుంది. అందుచే ఈనఖక్షత మాచరించుట సులభము. ఉచ్ఛరితము మాత్రమట్టిదికాదు. దాని నాచరించుటకు పురుషుని యందొకింత నేర్పు అవసరము. వీణవాయించునప్పుడువోలె పురుషుడు తనచేతి వ్రేళ్ళను వదులుగా ముడిచియుంచి బొటనవ్రేలిని, భార్యా శరీరమునందాన్చియుంచి వీణతీగను మీటినట్లు మిగిలిన నాలుగు వ్రేళ్ళను చటచట ధ్వనితో బొటనవ్రేలిమీదుగా భార్యా శరీరమును తాకునట్లు చేయుట "ఉచ్చరితము" అప్పుడు బొటనవ్రేలిగోటి రేఖ కొంత స్పష్టముగా నున్నను, మిగిలిన గోళ్ళయొక్క రేఖలు అల్పస్పర్శతో అభిరామముగ అస్పష్టముగ ఉదయిస్తాయి. అందుచే ఉచ్ఛరితము నాచరించుటకు కొంత ఊహతోడి నేర్పు అవసరము. అర్ధ చంద్రమునకు ఊహతో నేర్పుతో పని యుండదు.

3. మండలకము : మండలకము అనగా గుండ్రనిది. అర్ధ చంద్రములను రెండింటిని ఒకదాని కొకటి అభిముఖంగా రేఖలను కలుపుతూ ఆచరించినపుడు మండలకము ఏర్పడుతుంది. బొటనవ్రేలిగోటితో మరియొక వ్రేలి గోటిని దగ్గరగా చేర్చి నొక్కుట వలన మండలకము ఏర్పడుతుంది. భార్యయొక్క కంఠముస్తనములేకాక పిరుదులుకూడ ఈ మండలకమునకు తగిన స్థానములై ఉన్నాయి.

4. వ్యాఘ్రపదము : వ్యాఘ్రమనగా పెద్దపులి. అది ఒక చోట నుండి మరియొక చోటునకు పొడవుగా లంఘించు (దాటు) స్వభావము కలదై ఉంటుంది. అట్లే భార్యయొక్క తొడలపై, పిరుదులపై పురుషుడు కొలది పొడవైన గోటిగీరల నేర్పాటుచేసినచో అది వ్యాఘ్రపదము అనబడుతుంది. పెద్దపులి యొక్క పాదముల గుర్తులవోలె దీర్ఘములైన గుర్తులు దీనియందేర్పడుతాయి. అందుచే దీనికి వ్యాఘ్రపదమని పేరు వచ్చినది.