పుట:NagaraSarwaswam.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

90


వ్యాపించి తన తీవలచే ఆ వృక్షముయొక్క కొనగొమ్మలను క్రిందికి వంచడం చూస్తూవుంటాము.

సరిగా అటులే భార్య తన సర్వశరీరముతోడను భర్తయొక్క శరీరాన్ని చుట్టుకొన్నదై ఉన్నతమైన ఆతని ముఖాన్ని చుంబించుటకు క్రిందికి వంచుట జరిగితే అది లతావేష్టితము అనబడుతుంది. వివాహితలై పరస్పరం బాగా పరిచయాన్ని పొందిఉన్న దంపతులయందీ ఆలింగనం ఏర్పడుతుంది. మనస్సులో కోరిక తీవ్రంగా ఉన్నపుడుమాత్రమే భార్య ఈవిధమైన లతావేష్టితాన్ని ఆచరిస్తుంది.

4. వృక్షాధిరూఢము :- వృక్షాధిరూఢము అనగా చెట్టు ఎక్కినటులు వర్తించుట. భర్త నిలువబడి యుండగా అతనియొక్క ఒకపాదమును భార్య తన ఒకపాదముతో త్రొక్కి-రెండవపాదము నాతని తొడపైనుంచి, అతని నడుము నొకచేతితోడను, మెడను వేరొకచేతితోడను పట్టుకొని, అతని ముఖాన్ని వంచి ముద్దుపెట్టుకొనుటకు యత్నిస్తే అది వృక్షాధిరూఢము అనబడుతుంది.

అలా తాను నిలువబడి యుండగా ఏ కొబ్బరిచెట్టుమీదకో ఎక్కుతూవున్నట్లు తనమీదకు ఎక్కి నిలచి, తన ముఖాన్ని ముద్దు పెట్టుకొనుటకు యత్నించే పలుచని శరీరంకల భార్యను చూచి నవ్వుతూ భర్త తన ముఖాన్ని సహజంగా ఆమెకు ముద్దు పెట్టుకొనుటకు చిక్కనీయకపోవడం కూడ జరుగుతూ వుంటుంది. అప్పుడామె అతని ముఖాన్ని అందుకొనడానికై యత్నించి, తన యత్నాన్ని విఫలంచేసె భర్తనుచూచి గారం గుడుస్తూ దైన్యాన్ని ప్రదర్శించడం ఆమె దైన్యాన్ని చూచి భర్త ఆమెను పొదవుకొనడం కూడ జరుగుతూ ఉంటుంది. ఇట్టి ఆలింగనమునకే "వృక్షాధిరూఢ" మని పేరు. భర్త సమున్నతమైన దేహము కలవాడైనపుడు, భార్యయొక్క