పుట:NagaraSarwaswam.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

91


మనస్సులో కోరిక తీవ్రముగా ఉదయించినపుడు ఇట్టి ఆలింగనము ఏర్పడుతుంది.

5. తిలతండులము :- తిలలు అనగా నువ్వులు. తండులములు అనగా బియ్యము. వీని రెంటిని కలబోసినపుడు ఒకదాని నుండి వేరొకదానిని విడదీయుట సుఖసాద్యము కాదు. అట్లే భార్యాభర్తలు శయ్యపై మిక్కిలి అనురాగముతో ఒకరిశరీరాన్ని ఒకరు పొదవుకొని గాఢాలింగనంలో ఏకీకృత శరీరులై ఉంటే ఆ స్థితి తిలతండులము అనబడుతుంది.

6. క్షిరనీరము :- క్షీరము అనగా పాలు. నీరము అనగా నీరు. పాలలో నీరు కలిపినపుడు ఇవిపాలు, ఇదినీరము అని విడదీయుట సాధ్యముకాదు. అట్లే భార్యా భర్తను, అతని శరీరములో లీనమగుచున్నదేమో అనునటులం గాఢంగా ఆలింగనం చేసికొని, అతని శరీరంతో కలిసిపోయి ఒకటిగావున్న తన శరీరమును ఆ ఆలింగనస్థితియందే ఇంచుక కదల్చుట జరిగితే ఆది "క్షీరనీరము" అనబడుతుంది. భార్యా భర్తలు గాఢాలింగిత శరీరులై నిశ్చలంగా ఉండుట జరిగితే తిలతండులము. గాఢాలింగన స్థితియందు నిశ్చలంగా కాక ఇంచుక కదలేవారైతే క్షీరనీరము అని గ్రహించాలి. ఏమనగా క్షీరనీరములు ద్రవములగుటచే ఒకదానితో నొకటి కలిసినపుడు వానియందు తరంగమువంటి చలనము యేర్పడుతుంది. తిలతండులములయందది ఉండదు.

7. జఘనోప గూహనము :- జఘనము అనగా మొల. భార్యా తన భర్తయొక్క జఘనభాగమునకు తన జఘనభాగము నాన్చి అతనిని బలముతో ఆక్రమించుకొని జారుచున్న పైటకలదై గతంలో భర్త తన శరీరముపై ఆచరించిన నఖక్షతాలను (గోటి నొక్కులను) వెల్లడించే శరీరముతో ఆలింగనము చేసికొనుట జరిగితే అది "జఘనోప గూహనము" అనబడుతుంది.