పుట:Naganadham.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నరుణులు నీతో చెప్పమని కొన్ని వాక్యాలు నాకు చెప్పారు. ఆ సందేశం నీవు సావధానంగా వినవలసిందని నా కోరిక" అన్నాడు నలుడు.

దమయంతి తటాలున లేచి, నలునికి రాజోచిత మైన స్వాగత సత్కారాలు చేసి నమస్కరించింది. పిదప సవినయంగా అతనితో ఇట్లు పలికింది. 'మహారాజా, నీవు నా హృదయ మందిరములో ఎప్పడో ప్రవేశించావు. ఇప్పడీ అంతఃపురంలోకి సందేశ వాహకుడనై దూతగా రావటం, అందులోనూ దేవదూతగా రావటం నా అదృష్టం. నీవు చెప్పవలసిన సందేశం చెస్తే వింటాను.” అన్నది. నలుడు గుండె దిటవు చేసుకొని యిలా చెప్ప నారంభించాడు. 'రాజకుమారీ, ది క్పాలకులు నీ కటాక్షాన్ని ఆశించివచ్చారు. ఇందాగ్ని యమ వరుణులప్రతాప ప్రాభవాలు నీవెరుగనివి కావు. వారిలో ఏ ఒక్క రినైనా వరించవలసినదని వారు వేర్వేరుగా నా ద్వారా నిన్ను ప్రాద్ధిస్తున్నారని భావించు. ఇంకోమాట. వారంతా దేవతలు. వారిమాట "కాదని సీ వితరుణ్ణి వరిస్తే వారు నీ వివాహానికి, భావిజీవితానికి కూడ "కావలసినంతగా ఆటంకము కలిగించగలరు. అదికాక, దేవభోగం, కోరి వెదకి వచ్చిన అమృతం, కాలికి తగిలిననిధి, ఎందుకు వదులుకోవాలి? కాబట్టి నీవీ నలుగురిలోనూ ఏఒక్కరి నైనా వరించి నట్లయితే మేలౌతుందని నా అభిప్రాయం. ఏమంటావు?" అని అడిగి నలుడు ఆమె జవాబుకోసం ఎదురు చూసేడు.