పుట:Naganadham.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రున్నారు. ఎక్కడ తన గుట్టు రట్టవుతుందోనన్న ఆందోళ నతో నలుడున్నాడు. ఎలాగైతేనేమి, చివరకతడు దమయంతి సాన్నిధ్యానికి చేరుకొని కృత కృత్యుడయ్యాడు. తిరిగి ఆమె సౌందర్యాన్ని చూచి ముగ్ధుడయ్యాడు. తను వచ్చినకార్యాన్ని తలంచి తనట్లా తలచకూడదను కొన్నాడు. కాని దమయంతి ఆ సమయంలో తనరూప గుణాదులే సఖులతో చర్చింస్తూండటం గమనించి, విధివై పరీత్యానికి మెచ్చుకున్నాడు. ఎట్టకేలకు తెగించి తిరస్కరిణీ విద్య తొలగించి దమయంతికి సాక్షాత్కరింతాడు.

ఉన్నట్టండి ఊటిపడ్డట్టు, అతఃపురములోకి వచ్చిన రాకుమారుని చూచి దమయంతి, ఆమె చెలిక తైలుకూడ నివ్వెర పోయారు. ఉవ్వెత్తన లేచి కూర్చున్నారు.కూర్చున్న వారేందుకో అన్నట్లు లేచి నిలబడ్డారు. దమయంతి సమయజ్ఞ రాలు, ఉచితాంచితా లెరిగినపిల్ల. గాబరాపడడానికి బదులు సవినయంగా నలుణ్ణి అడిగింది. అయ్యా విూరెవరు? యీఅభ్యంతర మందిరం లోకి ఇందరి కండ్లు కప్పి విూరెలా రాగలిగేరు. విూ రూపులేఖలు, ధైర్య సాహసాలు, హావ భావాలుచూస్తే మీరు దివ్య పురుషులవలె కనిపిస్తున్నారు. విూరు నలమహారాజు "కాదుకదా! ఇంతకీ విూరు వచ్చిన కార్య మేమో చెప్పి సంతోష పెట్టుతారా?"

దమయంతి మాటలు విని నలుడికెంతో ఆనందం కలిగింది. "కల్యాణీ, నీ అనుమానం సత్యమే. నేను నలుణ్ణే. నేనిప్పడు వచ్చిన కార్యం దేవకార్యం, ఇంద్రాగ్ని యమ