పుట:Naayakuraalu.Play.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

నాయకురాలు

మ. దే. రా : మా తరపున బ్రహ్మనాయుడుగారు, వారి చర్యలకు నేనూ బద్దుడనే.

నాయ : నరసింగరాజుగారూ, మొదట అచ్చకాకిడేగను వదలండి.

బ్రహ్మ: మంచిదానిని యేర్చారు. నలుపులో కాకిని మించింది. కన్నడూ, మనం వింజాబెరసను వదలుదామా ?

కన్న : వద్దు. అసలుబెరసనే వదలుదాం.

బ్రహ్మ: సరే.

నాయ : ఎంత అందంగా వుందీ ! కండ్లు తెల్లగా బేడబిళ్లలలాగున్నవి. మా నెవలికి దీటుగాదు. అయినా చూతాం.

నల. రా : రెండూ పోరుతుంటే కర్ణార్జునుల ద్వంద్వయుద్ధంలా గున్నది.

మ. దే. రా : ఒక తన్నుకే డేగకు బోర బద్దలుగా చీలింది.

నాయ : చీలినా మెడపట్టు వదిలిందేమో చూడండీ. ఆ పట్టులో బెరస పడవచ్చు.

బ్రహ్మ : ఫయిసల్, మెడమీది దెబ్బతో డేగ పడిపోయింది.

అ. రా : నాగమ్మగారూ ! యింకొకదాన్ని వదలుతారా ?

నాయ : రాజుగారూ ! పూరికోళ్లలో బడిరకం చూసి వదలండి.

మ. దే. రా : (రహస్యంగా) సరుకు ఖాళీ అయినట్టున్నది. పూరికోళ్లలోకి దిగింది.

బ్రహ్మ : వినేను ; చిన్నగా మాట్లాడండి. బెరసక్రింద పూరి కోడి ఆగలేదు. అయిదు నిమిషాలుకూడా పట్టదు

బా. చం: అయింది. పూరికోడి పూరిమేసింది. ఇంకొకదాన్ని తియ్యండి.