పుట:Naayakuraalu.Play.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకురాలు

81

బ్రహ్మ : పడిపోయినా వదలదు చూడు. పూరికోళ్లలో మెరుగయిందే, బెరసకు ఆగ లేకపోయిందిగాని.

నాయ : బెరసలు మాదగ్గర లేవు. వింజాబెరసను వదిలి చూస్తాం.

బా. చం : ఇది తొలిముద్దకే పోతుంది. వియ్యమయినా కయ్యమయినా సరిదీట్లతో చెయ్యాలె.

నల. రా : వింజాబెరస అంత తీసివేసిందేనా ?

బా. చం : ఎంతోనా ? చూడండి. అది మొగిసి ముందుకు రాందే?

నల. రా : రాకేమి ? కమరబడ్డది.

బా, చం: అదుగో ! ఒక్కతన్ను కే తెల్లయీకె వేసింది. అరరే! పరుగెత్తిపోతున్నది.

[ బ్రహ్మనాయుడుపక్షమువారు నవ్వుతారు ]

మ. దే. రా: నాగమ్మగారూ ! కోసకోళ్లనుగూడా పందేలకు పెట్టిస్తున్నారేమి ? మీవైపున దీటయిన పుంజులు లేకపోతే చెప్పండి ; మేము పెట్టలను వదలుతాము.

నాయ : పుంజులు వోడిపోయి పెట్టలే గెలుస్తవేమో, ఎవరు చూచారు? నరసింగరాజుగారూ, ఈసారి నెవలిని వదలండి.

బ్రహ్మ : ఇది చూపులకు బాగానే వున్నది. వరియెన్ను లాగ తో కానూ అదినీ.

నాయ: దీనితో మీ బెరస ఫయిసల్.

బా. చం: నెవలి బెరసను కొట్టటానికి యిదే మొదలు. మీకంత బరవాసావుంటే ఎంతపందెం వొడ్డుతారో చెప్పండి.