పుట:Naayakuraalu.Play.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

నాయకురాలు

నర : రాజుగారి యీ నిశ్చయమువలన మనకు జయముకలిగినట్లే భావిస్తాను.

కే : నిశ్చయం.

నర : మాటలసందున మనం గమనించలేదుగాని అడవి రాను రాను దూర సందులేకుండా పెనవేసుకొని, ఏ కొమ్మ దేనిదో చెప్పడానికి వీలులేకుండా వున్నది.

కే : ఎడం లేకపోవడంచేత ఒక దానికొమ్మ యింకొకదానికి అంటుబడుతున్నది.

నల : అది కొమ్మలకు స్వభావమే. అందుకనే చెట్లు దూరంగా నాటమన్నా రు.

నర : మీరు పొరబడుతున్నారు. అన్ని కొమ్మలూ అట్లా అంటుబడవు. కొంతవరకు అది చెట్టునుబట్టి వుంటుంది.

కే : పండ్లచె ట్లంటుబడతవిగాని ముండ్లచె ట్లెక్కడైనా అంటుబడడం చూచారా?

నల : ముండ్లచె ట్లెవరూ అంటుదొక్కరు.

నర : పల్నాటిలో కొమ్మలు ఇతరచెట్ల కంటుబడవుగూడాను.

నల : దానికి కారణము అన్నీ ముండ్లచెట్లు కావడమే .

కే : కారణ మేదైనా, అది మాకు గౌరవమే. నల: చూ డిక్కడ, పులెడుగుల జాడ లున్నవి.

కే : పులులకేమి ? ఈ ప్రాంతమున పులులు, అడవిపందులు ఏట్లాడుతుంటవి.

నల : ఊళ్లదగ్గర పులులు చెర్లాడుతుంటే జనులకు భయంగదా?

కే : ఒక్కొక్కప్పుడు పులులు ఊళ్లమీది కెగబడుతుంటే మనుష్యులు కర్రలతో కొట్టి చంపుతుంటారు.