పుట:Naayakuraalu.Play.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120

నాయకురాలు

డా నరసారెడ్డినీ, మలినీడు చింతపల్లిరెడ్డినీ మడియించి యిద్దరూ యేకమై మన తూర్పుసైన్యములం దాకగా నలగొండ బాపన్నా, కోలంకి వీరాస్వామీ, పొదిలె బాపన్నా వారి కడ్డుపడి సైన్యముల రక్షించుకొన్నారు.

అప్పటికి రెండుజాములు కావచ్చినది. భానుప్రభల నినుమడించి గండరగండడని పేర్వడిసిన మాడుగుల వీరారెడ్డి ఆరితేరిన ఆహవపాండిత్యముకు మొక్కవోని ప్రతాపము బాసటగా శత్రుసైన్యములపై బడి నుగ్గు నూచముగ జేస్తుండగా, సేనాపతు లెంతప్రోత్సహించినా నిలువలేక పారిపోవు సేనలను మరలించుకొంటూ పిన్నమలిదేవుడు అడ్డమై మాడుగుల జోదుయొక్క ప్రతాపాగ్నికి ఇంధనమై ఒక్క నిముసములో సమసిపోయినాడు.

నాయ : ఇది బ్రహ్మనాయుడికి మొదటిదెబ్బ.

ఝుట్టి : రాచకొడుకు పడంగానే బాలునిసైన్యములో హాహా కారములు చెలరేగినవి. విచారం, కోపం, డంబము వర్ణనాతీతమయినవి. బ్రహ్మనాయుని సేనాసముద్రపు కెరటములన్నీ, మాడుగుల వీరుడను పర్వతముపై గొట్టనారంభించినవి.

నల. రా : ( ఆశ్చర్యముతో ) వీరడే వీరుడు.

ఝట్టి : మబ్బులుగప్పిన మార్తాండునివలె వీరారెడ్డి సైనిక సమూహములో మరుగైపోయినాడు. మన వీరులందరు త్వరపడి వీరారెడ్డికి బాసటయైనారుగాని వానిం జేరలేక పోయినారు. కొంతవడికి వీరారెడ్డి విరమించెనని శత్రువుల సింహనాదములు ప్రకటించినవి. మనసైన్యము గ్రహణము