పుట:Naayakuraalu.Play.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకురాలు

121

గప్పిన పగటివలె కాంతిహీన మయినది. విరామఘంట వినబడగానే యెవరిశిబిరములకు వారు పోయినారు. నే నిట వచ్చాను.

నల. రా : వీరారెడ్డికి వీరోచితమరణము సంభవించినది. అతడు లేనిలోపము మనము నివర్తిచేయలేము.

ఝట్టి : సెలవిండు. రణరంగమునకు వెళ్లుతాను.

(నిష్క్రమణం)

నల. రా: ఏ మా కలకలము ?

[ఝట్టిరాజు తెరలో)

యోధాగ్రేసరులారా ! తమ్ముని మరణముచే క్రోధమూర్తియై మలిదేవభూపతి అలరాజు మరణమునకై కసిబట్టివున్న బాలచంద్రుని బాసటచేసుకొని బహుళ సేనాసమేతుడై నరసింగభూపతి నొంటరిగా దాకి పట్టుకొనబోతున్నాడు. బిక్క మొగంబులు వైచుకొని పరువెత్తెద రేల ? మాడుగులరెడ్డి మరణించుటచే అసహాయుడై సేనల గోల్తలు సేయలేకున్న సేనాధ్యక్షుని విడిచి పారిపోయెద రేల ? ఓరీ పాపులార ! బాలుడు పట్టనే పట్టినాడు. అయ్యో, యెంతకష్ట మెంతకష్టము ? సేనాధ్యక్షు డిట్టి దిక్కులేని దుర్మరణమునకు లోబడుట విధినియతిగదా !

నాయ : (లేచి) తే తెమ్ము. ఓరీ! పిరికిపందలారా! నాగాంబిక ఖడ్గము ధరించివుండగా నరసింగభూపతి కెట్టి విపత్తును కలుగ జాలదు. పారిపోయి కలకాలము జీవించగలరా?

(నిష్క్రమణం)