పుట:Naayakuraalu.Play.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకురాలు

105

కొమ్మ : ఈ సూచన చాలా బాగావుంది. ఇంతవరకూ దేశం వారి స్వాధీనములో వున్నదిగనుక చెప్పి ప్రవేశించడమే మర్యాద.

బా. చం : గోదావరిస్నానానికి కొండభొట్ల ఆజ్ఞెందుకు ? పల్నాడు మన మాతృభూమి, బిడ్డలు తల్లివొళ్లో కూర్చొనడానికి ఒకరి ఆజ్ఞా?

అ. రా : చెప్పి పంపకపోతే కలహానికి కాలుదువ్వినట్టుగా వుంటుంది.

అనపోతు : కలహంలేకుండా రాజ్యమిస్తారనేనా మీ నమ్మకం ? అట్లయితే భారతకథ అబద్ధ మనవలసివస్తుంది.

అల. రా : నలగామరాజు దుర్యోధనుడికంటె మంచివాడు. కేతురెడ్డి శకునంత దుర్మార్గుడు గాడు.

అనపోతు : నరసింగరాజు దుశ్శాసనుడికంటె దుష్టుడు.

బా. చం: ఆలోచనలో నాగమ్మ కర్ణుడికంటె సమర్థురాలు.

క. దా : మనకు బ్రహ్మనాయుడనే కృష్ణు డున్నాడు.

కొమ్మ : దుర్యోధనుడికి కృష్ణుడితో సమదీటయిన మంత్రి లేడు. నాగమ్మవల్ల నలగామరాజు కాలోపం నివర్తి అయింది.

బా. చం : కనుక నే మనభారం మఱింత యెక్కువయింది.

కొమ్మ : అందుకనే పోరుకంటె పొందు మేలని చెపుతున్నా.

బా. చం : కాబట్టే నలగామరాజు బొత్తిగా సంధి కంగీకరించడు

కొమ్మ : ఆ తప్పు వాండ్లమీదనే పెడదాం.

బా. చం : తిరిచి భోగించడం దీనులపని. క్షత్రియధర్మంగాదు.