పుట:Naatyakala maasapatrika, sanputi 1, sanchika 2, april 1935.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

118 నాట్యకళ


నాట్యవేదము సృష్టింపబడిన వెనుక తొలుదొల్త. భరతాచార్యులు తన కుమారులతోను, శిష్యులతోను గలిసి నాందియొనర్చి తదంతమున దేవతలు రాక్షసులు గెల్చిన యుదంతము నాటకముగ నాడెను. తర్వాత నాట్యమందిరము నిర్మించుకొని పరమేష్ఠియాజ్ఞచే 'అమృతమంథనము' అనునాటక మాడెను. అమృతమంధనమున దేవతలకు నష్టవస్తు పునర్లబ్ధి చేకూరినది; శత్రువిజయము ఘటిల్లినది; అమర్త్యత్వము లభించినది. కావుననే యిది 'ఉత్సాహజననమును, సర్వప్రీతికరము’నై నది. ఆ వెనుక బ్రహ్మ వీర నెల్లర గొనిపోయి హిమవంతమున మహేశ్వరునియెదుట 'త్రిపురదాహ మను డిమమును ప్రదర్శింపజేసెను. మహేశ్వరునియెదుట ప్రదర్శింపవలసినది తత్పరాక్రమమును ప్రకటించు త్రిపురదాహమే. ఇవి నాటివారి పరిస్థితుల కనుకూలములైన చక్కని సరిక్రొత్తకథా విశేషములు.

మన దేశమున జ్ఞానప్రచారమునకే నాట్యకళ ప్రభవించినది. భరతాచార్యులు నాట్యోత్పత్తికి హేతువు నిట్లు చెప్పుచున్నారు:

'గ్రామ్యధర్మే ప్రవృత్తేతు కామలో భవశంగతే,
ఈర్ష్యాక్రోధాదిసమ్మూధే లోకే సుఖతదుఃఖితే,
మహేంద్రప్రముఖై ర్దేవై రుక్తఃకిల పితామహః, ణ
క్రీడనీయక మిచ్ఛామో దృశ్యం శ్రవ్యంచ యద్భవేత్.
నవేదవ్యవహారోఒయం సంశ్రావ్యః శూద్రజాతిషు,
తస్మాత్ సృజాపరం వేదం పంచమం సార్వవర్ణికమ్.'

లోకమున గ్రామ్యధర్మము ప్రబలగా మరల సనాతనధర్మమును ప్రతిష్ఠింపగోరి మహేంద్రుడు పరమేష్ఠిని ప్రార్థించెను. అతడును కామలోభ వశంగతమును, ఈర్ష్యాక్రోధాది సమ్మూఢము నగు లోకము నుద్ధరింపదలచి, విద్యాగంధములేని శూద్రజాతులకుగూడ ప్రబోధము కల్గింపదలచి సార్వవర్ణికముగా నుండునట్లు

'జగ్రాహ పాఠ్యం ఋగ్వేదాత్ సామభ్యో గీతమేవచ,
యజుర్వేదా దభినయాన్ రసా నాథర్వణాదపి'

చతుర్వేదసారంబుగ నాట్యకళను సృష్టించెను.

నాటివలెనే నేడును 'దేశ మజ్ఞానహతమైనది. విద్యాహీనులకంటే విద్యాధికులమనుకొనువారే కుక్షింభరులై గుణహీనులు, పాపకర్ములు నై యున్నారు. ఇప్పుడు దేశమున నొసంగబడుచున్న విద్య విద్య కాదనియు, దీనికి