పుట:Naatyakala maasapatrika, sanputi 1, sanchika 2, april 1935.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆకాలమున ఒక సాంఘికనాటకము రచింపబడె ననుకొందము. ఆయాచార మస్తమింపగనే ఆనాటకముగూడ అస్తమించును. కాని రసాత్మమయినచో అంత సులభంముగా అస్తమింపదు.

    'నాటకము చూడదగినదేకాని వినదగినది కా ' దని అతివాదులందురు.  అయితే మనము నాటకమునకుబోయి చూడవలయునది మూకాభినయమా? కాదు, ఎంతమాత్రమును కాదు.  మనకు వినబడు శబ్ధజాలము అర్ధమునకును, నాట్యమునకును ఇసుమంతయు నాతంకము చేయరాదు.  ఎవరయినను నాటకము చూచివచ్చితిమందురు గాని వినివచ్చితి మనరు.  కావున కవి శ్రవ్యభాగమును దృశ్యములోనికి కరుగబోయవలెను.
  అలంకారికులు శృంగారరసమునెడల నీమాటలేయనిరి.  కరుణరసమునకు అద్ధమువలె స్వచ్చమగు భాష వాడమనిరి.
  ఇచట నొకటి గమనింపవలయును.  పడమటిదేశములలో ప్రేక్షకులలో నిరక్షరు  లుండరు.  మనదేశమున ఉందురు.  కావున ప్రకృతసాంఘికనాటకములు వ్యావారికభాషలో నుండవలయుననుట తేటతెల్లము.  కాగా రసప్రతిబంధకత లేవనంతవాస్తవముగాగూడ నుండవలయు నని అర్ధసిద్ధము.
    అలంకారికులు కావ్యము పలుదెఱగు లనిరి.  అందు అస్ఫుటమగు వ్యంగ్యముతో వాచ్య చమత్కారము కలదానికిని మూడవస్థానము కలదు.  దాన సుందరమగు ఆర్టు కలదని మన మనవచ్చును.  ఇట్టి నాటకములు ఇబ్ సెన్, షా మొదలగువారు పెక్కులు రచించిరి.  ఇక సాంఘికవిషయములను గ్రహించి కవులు వానిని రసాత్మకములనుగా చేయగలిగినచో వివాదమేడ? దానివలన రకృతము నాట్యకళ కొక కళ హెచ్చును.  సంఘమునకు ఒకమేలు చేకూరును. అట్టినాటకములకు నటులును, సహృదయులును ఎదురుచూతురు.