పుట:Naatyakala maasapatrika, sanputi 1, sanchika 2, april 1935.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సారంగధర ' శకలము '

వేదము వేంకటరాయశాస్త్రి

[అస్మత్పితామహులు శ్రీ'కళాప్రపూర్ణ ' వేదము వేంకటరాయశాస్త్రులవారు తాము జీవితదశలో చేసిన వాజ్మయసేవకన్న పెక్కుమడుంగులు చేయ సంకల్పించియు జీవితములో గలిగిన ఒడుదుడుకులచే అందు కొంతమాత్రమే చేయగల్గిరనుట ఎల్లవారికిని తెలిసియేయున్నది. అట్లే పదునైదు స్వతంత్రనాటకములను వ్రాయ సంకల్పించుకొని యుండిరి. వానిలో సారంగధర నాటకమును సంపూర్ణవిషాదాంతముగా, చిత్రాంగివిషముత్రాగుట, సారంగుడుతల్లి దండ్రులయొడిలో మృతిచెందుట, అతనిని అగ్నిసాత్కరించి రాజును, రత్నాంగియు అసలు ప్రవేశమొనర్చుట లోనగు సన్నివేశములతోను, ప్రతాపరుద్రీయమునందు విద్యానాధునింబోలె నన్నయ నారాయణభట్టును ఇందు నెక్కొల్పి సరియంకములలో నత్మనాటకనిర్మాణ చాతురి కవధిగా వ్రాయ సంకల్పించి యుందిరి. కాని అట్లుజరుగలేదు. విధి విపరీరముగదా!

    మా తాతగారిట్లు రచియింప సంకల్పించిన సారంగధర నాటకమున నొకకళకలం, వారేవ్రాసినది,  ప్రాతకాగితములలో కనుపించింది.  అది యానాటకమున కాయువుపట్టయిన చిత్రాంగిసలసంతను తెలుపు రసవంతమగు నొక 'దృశ్యము '.
    దీని యునికిని నేను ప్రసంగవశమున చెప్పగా "నాట్యకళ" సంపాదకులు శ్రీ నీలంరాజు వేంకటశేషయ్యగారు విని తమ పత్రికలో దీనిని ర్పకటింపవలసినదిగా నన్నుం గోరిరి.  వారి కోరికమెయి దీని నీ "నాట్యకళ" మూలముననే ఆంధ్రలోకమున కందజేయుచున్నాడను.

--వేదము వేంకటరాయన్]

చిత్రాంగి:-- ఒసే భామతీ నేనట్లు కుమిలిపోవలసినదే?

భామతి:- కలువ వెన్నలకు కమలము ఎండక్జు వాడెనందువు. నీ కేమి
    లోపము? మగ డాంధ్రనాధుడు, నిన్నుగన్న కంటితో వేఱొకతెం గన
    నొల్లడు. మీరు పూవుందావియంబోలె, మణియందేజమువోలె
    ఏకమైయున్నారు. నీభాగ్యము ఇంద్రాణీకైన లేదు. పతి నిన్ను క్షణ
    మయినంబాయడు.
చిత్రాంగి:- కలకమున కాలపాశమువలె తగుల్కొన్నాడు.
భామతి:- క్షణక్షణము నీమీది ప్రేమ హెచ్చుచున్నది.
చిత్రాంగి:- ఉరి బిగిసికొనుచున్నది. నాగతి యీముదుకని తెలిమీసాలకు
   సంపెంగనూనెపూయుట యైనది. నాకు పటములో ఆమోహవమూర్తిం