పుట:Naajeevitayatrat021599mbp.pdf/793

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మన ఆంధ్రరాష్ట్రం భారతదేశంలో ప్రధానరాష్ట్రంగా పరిణమింపడానికి చాలా అవకాశాలున్నాయి.

మరల ప్రకాశంగారి పత్రికా వ్యాసంగము

మంత్రివర్గంనుంచి దిగినతర్వాత, ప్రకాశంగారు మొదట్లో "గ్రామ స్వరాజ్య" మనే వారపత్రికను ప్రారంభించారు. అయితే, ఆయన - తాము ఊహిస్తున్న స్వయంపోషక గ్రామ స్వరాజ్య సంస్థాపనా విషయమై ప్రచారం చేయడానికి ఆ వారపత్రిక సరిపోదని గ్రహించారు. ఆ సమయంలో 'రినై జాన్స్ ప్రింటర్స్‌' అనేదానిని చెన్నపట్నంలో నడుపుతున్న దామర్ల వెంకట్రావుగారు అనే పిఠాపురం వాస్తవ్యులకు, ప్రకాశంగారి త్యాగశీలతమీద ప్రత్యేకమైన అభిమానం పుట్టింది. ఆయన తనచేత నున్న అచ్చుయంత్రాన్ని ప్రకాశంగారికి "విజయప్రభ" అనే తెలుగు దినపత్రిక ప్రచురించడానికిగాను ఇచ్చి సాయం చేశారు. ప్రకాశంగారి యీ యత్న సాఫల్యానికై, ఎమ్.కె.వి. రెడ్డి, బొప్పన హనుమంతరావుగారలనే బారిష్టరులు, "విజయప్రభ" ప్రచురణ నిమిత్తం ఒక కంపెనీ ప్రారంభించారు. పత్రికకు సంపాదకుడుగా బరంపురం వాస్తవ్యుడు, స్వాతంత్ర్య యోధుడు అయిన న్యాపతి నారాయణమూర్తిగారిని నియమించారు. అంతకు ఒక సంవత్సరం ముందు ఆయన కేంద్ర శాసన సభలో సభ్యుడుగా ఉండేవారు. కొంతకాలం సంపాదకుడుగా పనిచేసి - ప్రకాశంగారి దగ్గర తమకున్న చనవు నాధారంగా చేసుకొని ఆచార్య రంగాగారి వర్గంవారు తన సంపాదకీయాలతో జోక్యం కలుగజేసుకొంటున్నారనీ, ఆ పరిస్థితులలో తాను సంపాదకుడుగా పనిచేయడం కష్టమనీ చెప్పి, ఆయన మానుకున్నారు. దాంతో, అసలు పత్రికాప్రచురణకే భంగం వచ్చింది. ఆ పత్రిక నడచినన్నాళ్ళు చాలా వేగంగా ప్రజల అనురాగాన్ని సంపాదించింది.

అప్పుడు, ప్రకాశంగారు "ప్రజాపత్రిక" అనే ఆంగ్ల వార పత్రికను ప్రారంభించారు. అదికూడా తొందరగా ప్రజల అభిమానాన్ని పొందగలిగింది. ఒకసారి అ పత్రికలో, ఆలపాటి వెంకటరామయ్య