పుట:Naajeevitayatrat021599mbp.pdf/792

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మిత్రులు చేసిన వాదం వట్టి అపోహ. పరిపాలనాసౌకర్యము హెచ్చుగా కలిగి, ప్రజలు పరిపాలనలో భాగస్వాములై, దేశాన్ని మరింత బలిష్ఠముగా చేయడానికీ, దేశాభిమానము పెంచడానికీ పరమ సహాయకారులు అవుతాయి."

చివరికి, పట్టాభిగారు, వల్లభాయి పటేలుగారు, నెహ్రూగారు సభ్యులుగాఉన్న ఉప సంఘంకూడా చెన్నపట్నం సమస్యను సందిగ్ధంగా వదిలిపెట్టింది. చివరికి, 1952 లో సోషలిస్టు, కమ్యూనిస్టు పార్టీలలోని ఆంధ్ర సభ్యులు చెన్నపట్నంమీద ఆశ వదులుకోవడంవల్ల, ఆంధ్ర కాంగ్రెసుపార్టీవారు చెన్నపట్నం తమిళరాష్ట్రంతో కలిపివేయాలన్న నివేదికలో సంతకం చేయడంవల్ల - ప్రకాశంగారు, ఆయన అనుయాయులూకూడా చెన్నపట్నం లేకుండాఉన్న ఆంధ్రరాష్ట్రం ఏర్పడడానికి అంగీకరించవలసి వచ్చింది.

ఇలా చెన్నపట్నం మిగిలిన రాష్ట్రానికి వదలడానికి అంగీకరించగానే, అప్పటి ముఖ్యమంత్రి రాజాజీ సలహాపైన బళ్లారి జిల్లా కూడా ఆంధ్రభాగంలోంచి తప్పించారు.

1936 లో గంజాంజిల్లా ఉత్తరభాగం, జయపుర సంస్థాన భాగాలు - ఒరిస్సాలో చేరిపోయినవి. సేలంజిల్లాలో ఉన్న తెలుగు భాగాలు, మైసూరు రాష్ట్రంలో ఉన్న కోలారు వగైరా తెలుగుభాగాలు, మధ్యప్రదేశంలో చాందావరకు ఉన్న తెలుగు భాగములు - ఇవి ఏవీ తెలుగురాష్త్రంలో చేరకపోవడమే గాక, మరికొన్ని తెలుగుభాగాలు కూడా పోగొట్టుకోవలసి వచ్చింది.

మిగిలిపోయిన తెలంగాణాతో కలిపి విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అంతవరకు సంతోషించవలసినదే.

ఇప్పటికైనా, మనము ఐకమత్యంగా ఉండడం నేర్చుకొంటే,