పుట:Naajeevitayatrat021599mbp.pdf/784

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గ్రహింపగలిగారు. 1952 జనరల్ ఎన్నికలలో ఆ దోషారోపణ పత్రానికి గురి అయిన మంత్రులలో ఒక్కరూ తిరిగి ఎన్నుకోబడలేదు.

మొదట్లో, ఈ విషయాలను ప్రకాశంగారు బాగా నొక్కినొక్కి ప్రతి బహిరంగ సభలోనూ చెప్పాలని అనుకొన్నాము. కాని, ఎన్నికల సమయం వచ్చేసరికి, మేము వెళ్ళిన చోటల్లా ఈ మంత్రులు, వారి, అధికార దుర్వినియోగం అన్న మాటలతోనే వాతావరణమంతా నిండిపోయింది. ఫలితం మీదచెప్పినవిధంగా ఆ మంత్రులందరి పరాజయంగా పరిణమించింది. ప్రకాశంగా రీ విషయంలో చేసిన ప్రచారం వారి దూరదృష్టికి నిదర్శనము.

వీటి చరిత్ర యింతటితో ఆగలేదు. శాసన సభలో జరిగిన చర్చలు, గలాభాలు అన్నీ చూసి, అధిష్ఠాన వర్గంవారు వీటి విషయమై చర్చిస్తాము లెమ్మన్నారు. మేము చేసిన ఆరోపణలు ఋజువు చేయడానికోసం, వాటికి సంబంధించిన కాగితాలు ప్రభుత్వంవారు మాకు చూపించవలసిందని కోరాము. అప్పటి ముఖ్యమంత్రి కుమారస్వామి రాజాగారు. ఆయన విషయం ఇదివరలో కొంత వ్రాసే వున్నాను. ఆయన, కాంగ్రెసు అధిష్ఠానవర్గంవారి ఆదేశాన్ననుసరించి, ఆ కాగితాలన్నీ మాకు చూపించారు. దానిపై ఆయన, ఇవేవో ఒకమారు అదిష్ఠాన వర్గంవారు కూడా పరిశీలించి తుదినిర్ణయం తీసుకొంటే, కాంగ్రెసుపార్టీ బలపడుతుందని వ్రాయడం తటస్థించింది. దానిమీద, అధిష్ఠాన వర్గంవారు వర్కింగ్‌కమిటీ సభ్యులైన శంకరరావు దేవుగారిని వీటిని పరిశీలించడానికి, నియమించి పంపించారు.

ఇంతటిలో, పట్టాభి సీతారామయ్యగారి వర్గంవారు - తాము కూడా ఏదో ఒక దోషారోపణ చేస్తే తమ వర్గంమీద చేసిన దోషారోపణల బలం తగ్గగలదని ఒక ఆరోపణ చేశారు.

వారు, 1945 లో ఆంధ్రదేశంలో తుఫాను చెలరేగినప్పుడు తుఫాను బాధితుల సహాయార్థం వసూలుచేసిన డబ్బులో మిగులు ధనం, పాస్‌బుక్కు తమ వర్గానికి చెందిన కోశాధ్యక్షుని చేతిలోనే ఉండడంవల్ల - అందులో ఒక పెద్దమొత్తం ఇరవై వేల రూపాయలు,