పుట:Naajeevitayatrat021599mbp.pdf/723

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మంత్రివర్గంలో చేరడం రాజాజీకి అంగీకారం కాదని, అనుమానంలేని మాటలతో చెప్పివేశారు.

తిరిగివచ్చి, వారు చెప్పిన మాటలన్నీ యధాతథంగా ప్రకాశం గారితో చెప్పాను. అప్పటికే ఆయన కామరాజనాడారుగారితో మాట్లాడి ఉన్నారు. సాయంకాలం ఆయన చెప్పే పేర్ల కోసమని, ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన ఒకటో రెండో గంటల వ్యవధి కావాలని చెప్పారు. నే నింటికి వెళ్ళేసరికి, ప్రకాశంగారు - కేరళనుంచి రాఘవమేనోన్‌గారి పేరు, దక్షిణ కెనరానుంచి కె. ఆర్. కరంత్ పేరు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. అంతలో, నాడారుగారు పంపిన మనిషి కూడా వారి జాబితా అందజేశారు. అందులో అన్నీ దక్షిణ దేశీయులపేర్లే ఉన్నా, తమతో చేయి కలిపి, ప్రకాశంగారికి వ్యతిరేక నాయకత్వాన్ని సాధించడానికి యత్నించిన వారిపేర్లు లేవు. అయితే, వారు నాడారు వర్గంలో వారు కాబట్టి వారూవారూ చూసుకోవలసిన విషయం అది. తర్వాత, భాషాభేదాన్ని పురస్కరించుకోకుండా తమ వర్గానికి చెందిన భాష్యం అయ్యర్‌గారిని ప్రకాశంగారు తమ జాబితాలో వేసుకున్నారు.

ఏప్రిల్ 30 న ప్రకాశంగారి మంత్రివర్గం ఉద్యోగ స్వీకరణ ప్రమాణం తీసుకొన్నది. ఆయన మంత్రివర్గంలోని మంత్రులు పదకొండుగురిలోను తొమ్మిదిమంది న్యాయవాదులు.

మంత్రివర్గము వెంటనే చేసిన పనులు

ప్రమామాణ స్వీకారం జరిగిన వెంటనే, రాజకీయ ఖైదీలను విడుదల చేయడానికీ, గ్రామాలమీద వేసిన జుల్మానాలను గ్రామస్థులకు తిరిగి ఇచ్చివేయడానికీ ప్రకాశం మంత్రివర్గంవారు నిశ్చయించారు. క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించిన అరవై తొమ్మిదిమంది రాజకీయ ఖైదీలను విడుదల చేస్తూ, మే 2 న ఆర్డరు పాసు చేశారు. ఒంగోలు బాంబుకేసులో లోగడ ఒక వ్యక్తిని దోషిగా నిర్ణయించి, అరెస్టు చేయమని పాస్ అయిన ఆర్డర్లను మే 9 న రద్దుచేశారు. ఆలాగుననే ప్రతివాది భయంకరం వెంకటాచారిగారికి స్థలమునుంచి