పుట:Naajeevitayatrat021599mbp.pdf/683

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రించి వేయవలసిందనే సూచనను వెంకటరావుకు చూపించి, "గాంధీజీ దీనికి ఎన్నడూ ఒప్పుకోడయ్యా!! నేను ఇలాంటి సూచనను గాంధీగారికి వ్రాస్తే, ఆయన 'నా మనస్సు ఆ మార్గంద్వారా నడవదు' అని నాకు జవాబు వ్రాశారు. అది నా దగ్గరుంది. " అని అంటే, దాని మీదట, "బందరుకునీవు కూడా రా! ఇవన్నీ చర్చించవచ్చు," అన్నాడు ఆయన. నేను "అట్లా రావడానికి అవకాశం లేదని, విశాఖపట్నం వెళ్ళి సామానులు సర్దుకుని నేరుగా బొంబాయికి వస్తా"ననీ అన్నాను. తర్వాత ఎవరి రైళ్ళు వారు ఎక్కాము.

బందరులో కొంతమంది కాంగ్రెసు మిత్రులు సమావేశమయారు. ఆ సమావేశం అధ్యక్షులయిన ప్రకాశంగారితో చెప్పి ఏర్పాటు చేసిందికాదు. అది వెంకట్రావు, పట్టాభిగార్లు తమలో తామే అనుకుని, ఇరవై, ముప్పై మంది కాంగ్రెసు మిత్రులకు మాత్రం తెలిపి ఏర్పాటు చేసింది. వారి వలెనే ప్రకాశంగారికి తెలియజేయగా, వారూ హాజరయ్యారు. వెంకట్రావు నాకు చూపించిన కార్యక్రమం కాగితాన్ని గాంధీగా రిచ్చిన ప్రోగ్రా మని చదివాడట. దానిపైన ప్రకాశంగారు, దాని వైఖరి చూసి అది గాంధీరిచ్చిన ప్రోగ్రాం కానేరదని వాదిస్తే, వాదోప వాదాలు బయలుదేరాయట. కొంత సేపయిన తర్వాత వేరే కాగితంపైన ఆ మీటింగులో జరిగిన ప్రొసీడింగ్స్ (కార్యక్రమ చర్చ) వ్రాసి, ప్రకాశంగారిని సభాధ్యక్షునిగా సంతకం పెట్టమన్నారట. కాని అందులో నిర్ణయా లేవీ లేవట. క్రమబద్దంగా ఏర్పాటు అయిన సమావేశం కానపుడు సంతకం ఎందుకని ప్రకాశంగారు మొదట అడ్డు చెప్పారట. దానిపై అక్కడ ఆ రోజు జరిగిన చర్చలు గల కాగితం కాబట్టి, సంతకం చేస్తే అది రికార్డవుతుంది గదా, అంటే ఆయన సంతకం పెట్టారట.

ఈ సమావేశం తర్వాత ఏ.ఐ.సి.సి. సభ్యులైన కాంగ్రెస్ మిత్రు లందరూ బొంబాయి చేరుకున్నారు. డాక్టర్ పట్టాభిగారు యథా ప్రకారం చావలి నాగేశ్వరరావుగారి యింట బస చేశారు. నేనూ విశాఖపట్నంనుంచి 6 వ తేది ఉదయానికి బొంబాయి చేరి, అలవాటు ప్రకారం