పుట:Naajeevitayatrat021599mbp.pdf/676

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుని ప్రకాశంగారు ఆయనను నిందించినట్లు పత్రికలు వార్తలు ప్రకటించాయి. దానిపై రాజాజీ యిది అబద్దమని ప్రకాశంగారిపై పరువు నష్టం దావా వేస్తానని ప్రకటించారు. తాము ఎవరి పేరూ చెప్పలేదు గనుక, తమకా బాధ్యత లేదని ప్రకాశంగారు జవా బిచ్చారు. కొంత కాలానికి డాక్టర్ పట్టాభి సీతారామయ్యగారు రాజాజీ వ్రాసిన ఉత్తరాలను తాము చదివినట్టు ప్రకటించగా, ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా తామలా వ్రాయలేదని రాజాజీ ప్రకటించారు.

ఇంగ్లండు వెళ్ళి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆఫీసులో, రాఘవేంద్రరావు (కౌన్సిల్ మెంబరు) వ్యతిరేకంగా ఉన్న ఉత్తరం చూపగా, ప్రకాశంగారికి ఆ విషయం అందజేసిన వ్యక్తి, దాన్ని పురస్కరించుకుని ప్రకాశంగారు మాట్లాడి తగవులో పడ్డప్పుడు - అవును, కాదు అని ఏమీ అనకుండా మౌనంగా ఉండిపోవడంవల్ల, ఆ ఉత్తరంయొక్క గ్రంథకర్తృత్వము, ఉద్దేశము మొదలైనవి యిప్పటి వరకు, లోకానికి తెలియవు.[1]పట్టాభి సీతారామయ్యగారు కూడా ఆ ఉత్తరంలో ఉన్న వివరాలుగాని, దాని కర్త పేరుగాని - తన ప్రకటనలో బయట పెట్టలేదు.

'క్విట్ ఇండియా' ఉద్యమం వచ్చిన తరువాత జరిగిన జనరల్ ఎన్నికల పిదప ప్రకాశంగారు చెన్నరాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం, సంవిధాన సభ (Constituent Assembly) లో సభ్యులుగా ఉండడం జరిగింది. ఆ సందర్భంలో వారూ, దుర్గాబాయిగారు, అనంతశయనం అయ్యంగారుగారు, రంగాగారు కలిసి, ఆంధ్రరాష్ట్రం

  1. నేను ఆ వ్యక్తిని - ప్రకాశంగారి జీవిత చరిత్ర వ్రాసే సందర్భంలో, ఆ ఉత్తరం విషయం తెలియజేయ గలరా అని ప్రార్థించగా, ఆయన ఇంతకాలమైనాక రాజాజీ మనసుకు ఎందుకు నొప్పి కలుగ జేయాలంటూ, తన పేరును ఈ వివాదంలోకి తీసుకు రావద్దని చెప్పడంవల్ల, వారికి నేనూ, నాకు వారూ వ్రాసిన ఉత్తరాలు ఇందులో పొందుపరచడంలేదు. అవి ప్రచురించ వలసిందిగా పాఠకు లెవరూ నన్ను నిర్భంధించరని ఆశిస్తున్నాను.