పుట:Naajeevitayatrat021599mbp.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బుజాలమీదా దెబ్బలు తగిలాయి. మాలో ముమ్మడి వెంకటరత్నం మాత్రం ఎదటివాళ్ళ దెబ్బలు తిని మమ్మల్ని కాచాడనే చెప్పాలి.

ఈ స్థితిగతుల్లో నేను, విధిలేక పక్కనే ఓరగా తెరచివున్న ఒక కోమటియింట్లో దూరాను. ముమ్మడి వెంకటరత్నం సుమారు 200 దెబ్బలు తిని పడిపోయాడు. నిజంగా ఈ ముమ్మడి వెంకటరత్నం మాకు అడ్డపడి, దెబ్బలు కాయకపోతే ఈ చరిత్ర అంతా జరిగేది కాదు! వాళ్ళు పడిపోయిన కొంతసేపటికి పోలీసు లంతా యథాప్రకారంగా విచ్చేశారు! వాళ్ళతోబాటు నేనూ బయటపడ్డాను! పోలీసులు మామూలు నాటకం జరిపించి అప్పట్లో వాళ్ళను ఆసుపత్రిలో చేర్చారు. మాకు పట్టుదలలు హెచ్చాయి. ఆ ఊళ్ళో యింకా నాటకాలు ఆడాము. తరవాత పోలీసువాళ్ళు సింగితం అబ్బాయి మీదా అతని యోధవర్గం మీదా కేసులు పెట్టారు. కాని సాక్ష్యం ఎల్లాగ? ఎవ్వరూ సాక్ష్యం పలకడానికి సాహసించలేదు. అందరికీ సాక్ష్యం చెబితే ఏమి కొంప ములుగుతుందో అన్న భయమే! కేసు విచారించే మేజస్ట్రీటుకి కూడా భయమే అయింది!

ఆ భయంచేతనే చామర్లకోటలో విచారణ జరిగింది. విచారణ జరిగిన తరవాత సాక్ష్యం లేదనే కారణంచేత కేసు కొట్టేశారు. దాంతో మా కసి మరింత హెచ్చయింది. మమ్మల్ని నడిబజారులో కొడితే కేసు లేకుండా పోవడమా!" అని బాధ కలిగింది. దీనికి ఎల్లాగయినా ప్రతీకారం చెయ్యాలనే పట్టుదల కలిగింది. ఇదీ కాకినాడ చరిత్ర!

కొద్ది రోజులకి నేను కిటికీలో కూర్చుని వుండగా కొట్టిన యనమండ్ర కొండయ్య అనే అబ్బాయి పార్టీమనిషి ఒకనాడు రాజమహేంద్రవరం వచ్చాడు. అతను వర్తకులదగ్గిర లెఖ్ఖలు వ్రాస్తూ వుండేవాడు. అతను ఊళ్ళోకి వచ్చాడని తెలిసి నేనూ, మాదిరెడ్డి వెంకటరత్నం నాయుడుగారి తమ్ముడు చలపతిరావూ - (అతను తరవాత చనిపోయాడు) మరికొందరు జట్టువాళ్ళమూ బయలుదేరి దారికాశాము. ఆ కొండయ్య ఊళ్ళో పని చూసుకుని కాకినాడ వెళ్ళడానికి పడవ ఎక్కాలనే వుద్దేశంతో ఒంటెద్దు బండిమీద ధవళేశ్వరం వెడుతున్నాడు. అప్పటికి సాయంకాలం సుమారు 4 గంట లయింది. "సమయం దొరి