పుట:Naajeevitayatrat021599mbp.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వరంలోనే కాక, ఆంధ్రదేశంలో ఉన్న ఆంగ్లవిద్యావంతు లెందరో ఆయనకి కృతజ్ఞులై ఉండాలి. ఆయన విద్యార్థుల్ని తనబిడ్డలకంటే కూడా ఎంతో ఆప్యాయంగా చూసుగునేవాడు. ఆయన లెఖ్ఖలూ, ఇంగ్లీషూ, షేక్సుపియరూ కూడా అత్యద్భుతంగా చెప్పేవాడు. ఆరోజుల్లో హెన్సుమన్ అనే అత నొక ప్రొఫెసర్‌గా వుండేవాడు. యమ్. రంగాచారిగారు కూడా ఒక ప్రొఫెసరే. ఆయన ఇంగ్లీషు చెప్పేవాడు అనుకుంటాను. రామలింగయ్యరు అనే ప్రొఫెసరు ఫిజిక్సు చెప్పేవాడు. బజులుల్లాలాగ నాకు బట్టీ పట్టే అలవాటు వుండేదికాదు. చదువు మీద కూడా అంతగా శ్రద్ధ వుండేదికాదు. కాని చదివిన కాస్సేపూ ఏకాగ్రతతో చదివి ప్రొఫెసర్ల అభిమానం సంపాదించేవాణ్ణి.

ఆ రోజుల్లో చదువు చాలా హెచ్చుస్థాయిలో వుండేది. ఎఫ్. ఏ. క్లాసులోనే ఇంగ్లీషులో ఛాసరు, డీక్వీన్సీ, కార్లైలు మొదలయిన వారి వుద్గ్రాంథాలన్నీ చెప్పేవారు. హిష్టరీలో ప్రపంచ చరిత్ర అంతా క్షుణ్ణంగా చెప్పేవారు. లెఖ్ఖలలో ట్రిగ్నామెట్రీ, ఆల్జీబ్రా బాగా బోధించేవారు. అప్లయిడ్‌సైన్సెస్ కూడా బాగా చెప్పేవారు. అన్నిటికన్నా ముఖ్యంగా మెట్కాప్ వడ్రంగం మొదలయిన చేతిపనులు కాలేజీలో అందరికీ నేర్పించే వాడు. ఆయన దానికి కారణంగా "నీ ఇంటి సామగ్రి నువ్వు చేసుకోవడమూ, నీ ఇల్లు నువ్వు కట్టుకోవడమూ నేర్చుకోవా"లని చెప్పేవాడు; తన శిష్యకోటిలో జాతీయాభిమానమూ, జాతీయసంప్రదాయమూ బాగా వృద్ధిచేసేవాడు.

ఈ కాలంలోనే నాకు బాగా గడ్డైన తగాదాలూ, కొట్లాటలూ సంభవించాయి. నా భవిష్యత్తు విషయంలో ఎంతో ఆశ పెట్టుకున్న హనుమంతరావు నాయుడుగారికి ఇతర బంధుమిత్రులికీ ఎంతో ఆదుర్దా కలగజేశాను. కొట్లాటలు, కేసులు, ఒకటేమిటి? తెల్లవారి లేస్తే రాత్రి అయ్యేలోగా ఏమి వస్తుందో తెలిసేది కాదు!

ఆ కాలంలో నాలో ఎక్కడలేని చొరవా, అఘాయిత్యమూ వుండేవి. ఎవరైనా నన్ను కొంచెం 'ఆ' అన్నా రంటే చెయ్యెత్తి