పుట:Naajeevitayatrat021599mbp.pdf/604

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇచ్చేందుకు వీలులేదని గట్టిగా చెప్పేశారు. కాని, పునరుద్యోగ లాభం ఆయనకు లేకపోవడంచేత ప్రపోర్షనేట్ పెన్షన్ ఇవ్వడం జరిగింది. కార్యసాధన అయిందని అనుకున్నాను. అయితే, వెంకటనారాయణగారు దాంతో వదలిపెట్టలేదు. పూర్తి పెన్షన్‌కు తాను అర్హుడని వాదించాడు. రాజకీయ కారణాలు లేకపోతే, వయ:పరిమితివరకూ తాను తప్పక ఉద్యోగం చేసేవాడిననీ, రాజకీయంగా మనం జయం పొందినపుడు తాను పూర్తిగా వయ:పరిమితి వచ్చేవరకు తప్పక ఉద్యోగం నిర్వర్తించినట్లే ప్రభుత్వం భావించవలెనని ఆయన వాదము. అటువంటి వాదం ఆనాటి ఆర్థికమంత్రి కనుచూపుమేరలో ఉండే రోజులు కావు. ప్రకాశంగారుకూడా చాలా ప్రయత్నం చేశారు కాని, మా వాదం ఫలించలేదు.

దండి సత్యాగ్రహ ఫిల్ములపై గల ఆంక్షల తొలగింపు

సత్యాగ్రహ సమరంలో ఉప్పు సత్యాగ్రహ ఘట్టం చాలా చరిత్రాత్మక మైనది. మార్చినెల ఆఖరిభాగంలో గాంధీమహాత్ముడు సబర్మతినుంచి పాదయాత్రపై దండీకి పోయి, సముద్రపు టొడ్డున నున్న ఉప్పు అధికారుల అనుమతి లేకుండ తీసి, ఆ విధంగా శాసనోల్లంఘనం ఆరంభించి దేశవ్యాప్తంగా సత్యాగ్రహం నడిపించిన ఘట్ట మది. కాలినడకను ఆయన సబర్మతినుంచి బయలుదేరి జంబూసరు చేరేసరికి నేను, దేశభక్త కొండా వెంకటప్పయ్యగారు మొదలైనవారము - ఆయనను, ఆయన నడిపిస్తూన్న సత్యాగ్రహదళాన్ని సందర్శించి నాము. ఆ దళంతోపాటు మేమూ ఒకరోజు నడిచాము. గాంధీగారు నడిచినంత మేరకు బ్రిటిషు గవర్నమెంటువారి అధికారం అమలులో ఉన్నట్టు ఎవరికీ తోచలేదు. బ్రిటిషు గవర్నమెంటు ఆ క్షణంతోనే పోయిందని ప్రజలు అనుకుంటూన్న తరుణం. గాంధీగారి రామరాజ్యం ఏర్పాటైందన్న మహాసమయం అది.

అప్పట్లో, అనేకమంది భారతీయులే కాక, విదేశీయులుకూడా వచ్చి చలనచిత్రాలను తీసేవారు. ఆ సందర్భంలో తీసిన చలనచిత్రా